ఆ పాటకి తమన్నా కి 2 కోట్లా?
ఐటం పాటల్లో తనమైన మార్క్ గ్లామర్ అపిరియన్స్ తో ఆకట్టుకోవడంతోనే ఆరేంజ్ లో డిమాండ్ కనిపిస్తుంది.
By: Tupaki Desk | 21 Aug 2024 3:00 AM GMTటాలీవుడ్ లో మిల్కీబ్యూటీ తమన్నా ఇప్పటికే ఐటం పాటలకు బ్రాండ్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. అమ్మడి సెకెండ్ ఇన్నింగ్స్ సౌత్ లో అలా ముందుకు తీసుకెళ్తుంది. అందుకు గానూ భారీగానే పారితోషికం ఛార్జ్ చేస్తుంది. అమ్మడు హిప్ మూవ్ మెంట్ తోనే బోలెడంత పాపులారిటీ సంపాదించింది. ఐటం పాటల్లో తనమైన మార్క్ గ్లామర్ అపిరియన్స్ తో ఆకట్టుకోవడంతోనే ఆరేంజ్ లో డిమాండ్ కనిపిస్తుంది.
తాజాగా బాలీవుడ్ లో సైతం అదే క్రేజ్ ని బిల్డ్ చేసుకుంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన స్త్రీ-2 లో "ఆజ్ కీ రాత్ష` పాటతో ఉత్తరాది ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. తొలి పాటతోనే అమ్మడు వాయు వేగంతో దూసుకుపోయింది. దీనికితోడు సినిమా సక్సెస్ అవ్వడంతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. మరి ఈ పాటకు అమ్మడు పారితోషికం ఎంత తీసుకుందంటే? అక్షరాల రెండు కోట్లు ఛార్జ్ చేసినట్లు వార్త లొస్తున్నాయి.
ఈ విషయంలో తమన్నా నిర్మాతలెక్కడా బేరాలు ఆడకుండా సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేసారుట.` లస్ట్ స్టోరీస్` వరకూ తమన్నాకి అక్కడంత డిమాండ్ లేదు. ఆరంభంలో కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత సౌత్ లోనే బిజీ అయింది. మూడేళ్లగా బాలీవుడ్ చిత్రాలపై ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. ఈ క్రమంలోనే తమన్నా డాన్సింగ్ ట్యాలెంట్ చూసి స్త్రీ-2లో ఐటం పాట ఛాన్స్ ఇచ్చారు.
వాస్తవానికి ఈ సినిమాలో తమన్నాతో ఐటం పాట ఏంటి? సినిమా రిలీజ్ కి ముందు విమర్శలొచ్చాయి. మొదటి భాగం `స్త్రీ`లో ఐటం పాటలో నటించిన నోరా ఫటేహీని రీప్లేస్ చేయగలదా? అని సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆమెని పక్కన బెట్టి తమన్నాకి ఛాన్స్ ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కానీ తమన్నా అంతకు మించి అని సీక్వెల్ లో ప్రూవ్ చేసింది.