Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : తమన్నా ఇంకా తగ్గేదేలే!

సోషల్‌ మీడియా కామెంట్స్‌కు చెక్‌ పెడుతూ తన కొత్త రూపంతో తమన్నా సర్‌ప్రైజ్ చేసింది. ఎప్పటిలాగే తమన్నా తన అందమైన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   28 Feb 2025 1:00 AM IST
పిక్‌టాక్‌ : తమన్నా ఇంకా తగ్గేదేలే!
X

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాల కాలం అవుతుంది. టాలీవుడ్‌లో ఈ అమ్మడు ఏ స్థాయిలో సినిమాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లోని దాదాపు అందరు సీనియర్‌ స్టార్‌ హీరోలు, యంగ్‌ స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన తమన్నా ఈమధ్య కాలంలో సినిమాల పరంగా కాస్త స్లో అయింది. అయితే వెబ్‌ సిరీస్‌లు, ఇతర షోలో, ఐటెం సాంగ్స్‌తో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ప్రస్తుతం 'ఓదెల 2' సినిమాలో నటిస్తున్న తమన్నా బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నాళ్లు అయిన తర్వాత కూడా బిజీగా తమన్నా ఉండటానికి కారణం ఆమె అందం.


తమన్నా అందం కారణంగానే రెగ్యులర్‌గా సినిమాల్లో ఆఫర్లు వస్తూ ఉంటాయని, ఆమెకు ఏదో ఒక ప్రాజెక్ట్‌ చేతిలో ఉంటుందని అంటు ఉంటారు. గ్లామర్‌ పాత్రల్లోనే కాకుండా డీ గ్లామర్‌ పాత్రల్లోనూ తమన్నా నటించి మెప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈమధ్య కాలంలో మిల్కీ బ్యూటీ తమన్నా మరింత స్టైలిష్‌గా కనిపిస్తుందని, గతంతో పోల్చితే తమన్నా మరింత అందంగా కనిపిస్తుంది అంటూ అభిమానులతో పాటు అంతా కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో మిల్కీ బ్యూటీ తమన్నా కాస్త బొద్దుగా అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియా కామెంట్స్‌కు చెక్‌ పెడుతూ తన కొత్త రూపంతో తమన్నా సర్‌ప్రైజ్ చేసింది. ఎప్పటిలాగే తమన్నా తన అందమైన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసింది. ఈసారి అల్ట్రా మోడ్రన్‌ లుక్‌లో ప్లీజ్ గో అవే అని రాసి ఉన్న టీ షర్ట్‌ ను ధరించింది. స్టైలిష్‌ కళ్ల అద్దాలను ధరించిన ముద్దుగుమ్మ తమన్నా గతంతో పోల్చితే ఇప్పుడు మరింత స్టైలిష్‌గా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా వయసు పెరుగుతున్నా, ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు దాటినా కూడా అందం విషయంలో తగ్గేదిలేదు అన్నట్లుగా ఆకట్టుకుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మిల్కీ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ఓదెల 2 సినిమా ప్రస్తుతం రూపొందుతోంది. ఇటీవలే ప్రయాగ్‌ రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో ఓదెల 2 సినిమా టీజర్‌ను లాంచ్‌ చేశారు. టీజర్‌లో తమన్నా నట విశ్వరూపం చూపించింది. సినిమాలో ఓ రేంజ్‌లో తమన్నా తన నటనతో మెప్పించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు తమన్నా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఓదెల వంటి సినిమాలు మాత్రమే కాకుండా గ్లామర్‌ పాత్రలు చేయాలని, ఐటెం సాంగ్స్ చేయాలని తమన్నా అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో తమన్నా బిజీగానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.