Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : 20 ఏళ్ల తర్వాత కూడా అదే అందం

హీరోయిన్‌ గా పుష్కర కాలం పాటు స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా సినిమాలు చేస్తూ వచ్చింది.

By:  Tupaki Desk   |   16 July 2024 3:30 PM GMT
పిక్ టాక్‌ : 20 ఏళ్ల తర్వాత కూడా అదే అందం
X

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు కాబోతుంది. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాలో హీరోయిన్ గా నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు తమన్నా పరిచయం అయ్యింది. మొదట్లో ఆశించిన స్థాయిలో హిట్స్ దక్కకున్నా హ్యాపీడేస్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.


హీరోయిన్‌ గా పుష్కర కాలం పాటు స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా సినిమాలు చేస్తూ వచ్చింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్స్ అడుగు పెట్టిన పది పన్నెండు సంవత్సరాలకు ఫేడ్‌ ఔట్‌ అవుతూ ఉంటారు.


కొందరు ఉండాలని ప్రయత్నించినా కూడా ఏదో ఒక కారణం వల్ల బరువు పెరగడం వంటివి జరిగి అందం తగ్గిపోతారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా ఏమాత్రం తగ్గడం లేదు.

ఆకట్టుకునే అందం తన సొంతం అంటూ తాజా ఫోటో షూట్‌ తో మరోసారి నిరూపించింది. తన నడుము అందం చూపిస్తూ క్లీవేజ్ షో తో మతి పోగొట్టిన ముద్దుగుమ్మ తమన్నా అందరిని మరోసారి సర్‌ప్రైజ్ చేసింది. ఈ స్థాయిలో అందంగా ఉండటం వల్లే ఇప్పటికి కూడా బిజీగా ఉంది.

ప్రస్తుతం స్టార్‌ హీరోల సినిమాల్లో వరుసగా నటించకున్నా కూడా ఈమె తోటి హీరోయిన్స్ తో పోల్చితే మాత్రం బిజీగానే ఉంది. సినిమాలు, సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బం, ఐటెం సాంగ్స్ ముఖ్యంగా సోషల్‌ మీడియా... ఇలా ప్రతి చోట కూడా తమన్నా కనిపిస్తూ కన్నుల విందు చేస్తూనే ఉంది.