Begin typing your search above and press return to search.

త‌మ‌న్నాని ఒణికించిన స్త్రీ--ఎందుకంత భ‌య‌మంటే?

వివ‌రాల్లోకి వెళ్తే ప్ర‌స్తుతం త‌మ‌న్నా ఐటం పాట‌ల్లో జోరు చూపిస్తోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 July 2024 9:30 AM GMT
త‌మ‌న్నాని ఒణికించిన స్త్రీ--ఎందుకంత భ‌య‌మంటే?
X

గ‌డ్డ‌క‌ట్టించే చ‌లిలో...ఎముక‌లు కొరియే జీరోడిగ్రీస్ లో షూటింగ్ చేయ‌డం అన్న‌ది న‌టీన‌టులకు అల వాటైన ప‌నే. సీన్ డిమాండ్ చేసిందంటే? ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లు చేయ‌డం అన్న‌ది న‌టుల విధి. ఎంత పెద్ద స్టార్ అయినా ఈ విష‌యంలో ద‌ర్శ‌కుల మాట వినాల్సిందే. తాజాగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఓ సినిమాలో ఐటం పాట కోసం ఏకంగా కొన్నిగంట‌ల పాటు తీవ్ర‌మైన ఎముకులు కొరికే చ‌లిలో న‌టించాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది.

వివ‌రాల్లోకి వెళ్తే ప్ర‌స్తుతం త‌మ‌న్నా ఐటం పాట‌ల్లో జోరు చూపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. హాట్ పాట‌ల్లో అమ్మ‌డు అందాల్ని హైలైట్ చేస్తూ ఓ రేంజ్ లో పెర్మార్మెన్స్ చేయ‌డంతో? ఐటం పాట అంటే త‌మ‌న్నా మాత్ర‌మే గుర్తొస్తుంది. అలాగే బాలీవుడ్ చిత్రం స్త్రీ-2 లో ఛాన్స్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమ్మ‌డు మాంచి మ‌సాలా నెంబ‌ర్లో క‌నిపించ‌నుంది. ఆజ్ కీ రాత్ అనే పాట‌లో ఇప్ప‌టికే కుర్రాళ్ల‌ని ఊపేస్తోంది.

తాజాగా ఈ పాట అనుభ‌వాల్ని త‌మ‌న్నా మాట‌ల్లోనే తెలుసుకుందాం. ఈ పాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కున్నా. 5 డిగ్రీలు ఉష్ణోగ్ర‌త ఉన్న చ‌లిలో షూట్ చేసారు. ఆ పాట‌ని నేను కూడా ఛాలెంజ్గా తీసుకుని పూర్తి చేసాను. కానీ తీవ్ర‌మైన చ‌లి త‌ట్టుకోవ‌డం చిన్న విష‌యం కాదు. చ‌లి కాస్త అయినా అల‌వాటు ఉంటే ప‌ర్వాలేదు. లేదంటే ఒళ్లంతా బొబ్బ‌లు క‌డుతుంది. దుర‌ద‌లు పుట్టిస్తుంది. ఇక్క‌డ మ‌రో స్పెష‌ల్ కూడా ఉంది.

ఆ పాట షూట్ చేస్తున్న రోజు-నా పుట్టిన రోజు ఒకే రోజు కావ‌డం విశేషం. ఆ ర‌కంగా ఈపాట‌ని నా జీవితంలో మ‌ర్చిపోలేను. అందుకే ఈపాటని ఓ గిప్గ్ గా భావిస్తున్నాను. ఈ పాట రిలీజ్ కి మందు ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసు కుంటారా? అనే భ‌యం వెంటాడేది. కానీ పాట రిలీజ్ త‌ర్వాత మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. క‌చ్చితంగా ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంది` అని చెప్ప‌గ‌ల‌ను అంది.