సొర చేప దాడిలో నటుడు మృతి!
కరేబియన్ నటుడు తమయో పెర్రీగా సొర చేప దాడిలో మృతి చెందాడు.
By: Tupaki Desk | 25 Jun 2024 6:50 AM GMTకరేబియన్ నటుడు తమయో పెర్రీగా సొర చేప దాడిలో మృతి చెందాడు. హవాయి సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న సమయంలో షార్క్ దాడికి గురయ్యాడు. ఓహూ సమీపంలోనే గోట్ ఐలాండ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దాడిని తమయోకి సమీపంలో ఉన్న వ్యక్తి చూసి వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వెంటనే జెట్ స్కీలో ఒడ్డుకు తీసుకొచ్చారు.
కొన ఊపిరితో ఉన్న తమయో ఒడ్డుకు చేరుకునే సమయానికి మృతి చెందాదు. పెర్రీ శరీరంపై సొర చేప గాయాలు స్పష్టంగా ఉన్నాయి. పెర్రీ మరణంతో ఓషన్ సేప్టీ అధికారులు ఆ ప్రాంతంలో షార్క్ హెచ్చరికలు జారీ చేసారు. పెర్రీ నటుడే కాదు 2016 లో ఓషన్ సేప్టీ డిపార్ట్ మెంట్ లో కూడా విధులు నిర్వర్తించాడు. అప్పటికీ నార్త్ షోర్ లో లైఫ్ గాడ్ గా పనిచేస్తున్నాడు. అలాగే సర్పింగ్ లో మంచి ఎక్స్ పర్ట్.
ఎంతో మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. ఇక `పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్` తో నటుడిగా ఎంతో ఫేమస్ అయ్యాడు. పెర్రీ బ్లూ క్రష్, చార్లీస్ ఏంజిల్స్: పుల్ థ్రాటిల్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అతడి వయసు 49 సంవత్సరాలు. సొర చేప దాడిలో ఘతంలో చాలా మంది గాయపడగా, మరికొంత మంది మృతి చెందారు. సరిగ్గా ఇదే నెలలో గత ఏడాది ఇలాంటి ఘటన బహమాస్‌లో చోటు చేసుకుంది.
పెళ్ళైన ఆనందంలో భర్తతో కలిసి 44 ఏళ్ల మహిళ సముద్రంలో పెడల్ బోర్డింగ్ చేస్తుండగా ఒక షార్క్ అటాక్ చేసింది. బామర్స్‌లోని వెస్ట్రన్ ప్రావిన్స్‌లో గల ఒక రిసార్ట్ వెనకాల ఉన్న సముద్ర తీరం నుంచి దాదాపు మూడు , నాలుగు మైళ్ళ దూరంలో సముద్రంలో విహరిస్తుండగా మహిళపై ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. షార్క్‌దాడిలో మహిళకు కుడి తుంటి భాగము, కుడి అవయవాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమె చనిపోయిందని వెల్లడించారు.