Begin typing your search above and press return to search.

అర‌వ ద‌ర్శ‌కులతో టాలీవుడ్ కి క‌లిసి రాలే!

అర‌వ డైరెక్టర్ల‌తో టాలీవుడ్ కి క‌లిసి రాలేదా? ప్ర‌య‌త్నాల‌న్నీ వైఫ‌ల్యంగానే క‌నిపిస్తున్నాయా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   25 Feb 2025 9:30 PM GMT
అర‌వ ద‌ర్శ‌కులతో టాలీవుడ్ కి క‌లిసి రాలే!
X

అర‌వ డైరెక్టర్ల‌తో టాలీవుడ్ కి క‌లిసి రాలేదా? ప్ర‌య‌త్నాల‌న్నీ వైఫ‌ల్యంగానే క‌నిపిస్తున్నాయా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ క‌థానాయ‌కుడిగా కోలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ లింగుస్వామి `వారియ‌ర్` తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా రోటీన్ ఎట‌ర్ టైన‌ర్ కావ‌డంతో ప్రేక్ష‌కులు పెద‌వి విరించేసారు. అటుపై యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో వెంక‌ట్ ప్ర‌భు `క‌స్ట‌డీ` చిత్రం ఫ‌లితం కూడా నిరాశ‌నే మిగిల్చింది.

ఇటీవ‌లే ఇండియన్ గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ రామ్ చ‌ర‌ణ్ తో తెర‌కెక్కించిన `గేమ్ ఛేంజ‌ర్` కూడా అలాంటి నిరుత్సాహానికే గురి చేసింది. వీట‌న్నింటి కంటే ముందే మ‌రో త‌మిళ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా మెగాస్టార్ చిరంజీవితో `గాడ్ ఫాద‌ర్` తెరెక్కించారు. ఇది ఆశించిన ఫ‌లితాలు సాధించ‌ల‌దు. అయినా వైఫ‌ల్యాల‌తో సంబంధం లేకుండా మ‌రింత మంది టాలీవుడ్ వైపు దూసుకొస్తున్నారు. టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్ చూసి ఇక్క‌డ హీరోల‌తో సినిమాలు తెరకెక్కించ‌డానికి అర‌వ ద‌ర్శ‌కులు ఉత్సాహం చూపిస్తున్నారు.

కింగ్ నాగార్జున హీరోగా న‌వీన్ అనే త‌మిళ డైరెక్ట‌ర్ మైత్రీ మూవీ మేక‌ర్స్ లో ఓ సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే పాన్ ఇండియా సంచ‌ల‌నం ప్ర‌భాస్ తో లోకేష్ క‌న‌గ‌రాజ్ కూడా ఓ సినిమాకి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ కూడా ఓ భారీ పాన్ ఇండియా సినిమాకు స‌న్నాహాలు చేస్తున్నారు. దీన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుంది.

ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో `జైల‌ర్` ఫేం నెల్స‌న్ దిలీప్ కుమార్ కూడా ఓ సినిమాకి రెడీ అవుతున్నారు. `జైల‌ర్ 2` త‌ర్వాత‌...తార‌క్ ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్ త‌ర్వాత ఈ సినిమా ఉండే అవ‌కాశం ఉంది. నేచుర‌ల్ స్టార్ నాని కూడా శిబి చ‌క్ర‌వర్తితో ఓ ప్రాజెక్ట్ కి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వెట్రీమార‌న్, హెచ్ .వినోధ్ లాంటి వారు కూడా టాలీవుడ్ స్టార్ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు.