పరువు హత్య తప్పేమీ కాదన్న డైరెక్టర్‌పై ఎటాక్
ఒక వ్యక్తి రంజిత్ పోషించిన విలన్ పాత్రలను ప్రస్తావిస్తూ.. X (గతంలో ట్విట్టర్)లో తీవ్ర వ్యాఖ్యలు చేసాడు.
By: Tupaki Desk | 11 Aug 2024 6:48 AM GMTతమిళ నటుడు-దర్శకుడు రంజిత్ పరువు హత్యను సమర్థిస్తూ షాకింగ్ ప్రకటన చేశారు. ఆగస్టు 9న తమిళనాడు సేలంలో ఆయన ఇటీవల దర్శకత్వం వహించిన కవుందంపాళయం చిత్ర ప్రదర్శన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ''కులం ఆధారంగా పరువు హత్యలు హింస కాదు. ఇది వారి పిల్లలపై తమ ప్రేమను చూపించే తల్లిదండ్రుల మార్గం'' అని అన్నాడు.
తల్లిదండ్రులకు మాత్రమే బాధ తెలుసు. పిల్లలే జీవితం అనుకునే ఆ తల్లిదండ్రులు కోపం చూపిస్తారు. ఇది హింస కాదు.. ఇది పిల్లలపై వారి శ్రద్ధ మాత్రమే అని అన్నారు. 90వ దశకం ప్రారంభం నుంచి తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన రంజిత్ కి ఇలాంటి వివాదాలేవీ కొత్త కాదు. అతడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఒకసారి 'పొట్టి బట్టలు వేసుకునే స్త్రీలు’.. 'అందరి ముందు డ్యాన్స్' అంటూ రకరకాల కామెంట్లు చేశాడు.
రంజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం 'కవుందంపలయలం' కూడా కుల ఆధారిత హింస, పిల్లలపై తల్లిదండ్రుల నియంత్రణ వంటి వివాదాస్పద అంశాలను ప్రస్తావించే సినిమా. ట్రైలర్‌లోను మరో వివాదాస్పద అంశం ఉంది.''మన్నుల వివాహం పన్నార్దు ముక్కియం ఇల్లా, పొన్నుల లా వివాహం పన్ననుమ్'' అనే ప్రస్థావన ఉంది. దీనర్థం..మా భూముల్లో వ్యవసాయం చేయడం ముఖ్యం కాదు.. ఆడాళ్లు గర్భం దాల్చడం ముఖ్యం! అనే డైలాగ్ ఉంది.
చాలా మంది కఠినమైన చట్టాలు కావాలని కోరుకుంటున్న తరుణంలో పరువు హత్యకు మద్దతిస్తున్న అతడిని చూసి ఇంటర్నెట్ ఆశ్చర్యపోయింది. ఒక వ్యక్తి రంజిత్ పోషించిన విలన్ పాత్రలను ప్రస్తావిస్తూ.. X (గతంలో ట్విట్టర్)లో తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. అందువల్ల అతడు అక్షరాలా సినిమాల్లో నటించలేదు. అతను సహజంగానే విలన్ (ఆ పాత్ర లాంటి వాడే) నాకు పాండవర్ భూమి గుర్తుకొస్తుంది. ఈ వ్యక్తి 'అనారోగ్య మనస్తత్వం' అర్థమైంది'' అని రాసాడు.
మీరు విషపూరిత మనస్తత్వాన్ని ప్రచారం చేస్తున్నారని నెటిజనులు అభిప్రాయపడ్డారు. ''రంజిత్, మీరు ఒక గీతను దాటారు.. పరువు హత్య అనేది ప్రేమ కాదు.. అనాగరికం.. మీ మాటలు అజ్ఞానం మాత్రమే కాదు.. ప్రమాదకరమైనవి.. ఇది కేవలం తల్లిదండ్రుల మార్గం కాదు.. ఇది హత్య.. మీరు మాట్లాడేది కేవలం తప్పు మాత్రమే కాదు.. మీరు సమాజంలో చోటు లేని విషపూరిత మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు'' అంటూ అతడిపై విరుచుకుపడ్డారు. ఈ వ్యక్తి కటకటాల వెనుక ఉండాలని ఒకరు అన్నారు. ఇది ప్రజాస్వామ్యం.. అయితే పరువు హత్యలను సమర్థించేవారు.. సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తారోనని భయంగా ఉంది'' అని మరొకరు ఆవేదన చెందారు.