న్యూడ్ గా నటిస్తే తప్పేంటి... హీరోయిన్ కామెంట్స్
తమిళ హీరోయిన్ ఆండ్రియా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.
By: Tupaki Desk | 15 Aug 2023 7:57 AM GMTతమిళ హీరోయిన్ ఆండ్రియా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు ఒక సినిమా కోసం సెమి న్యూడ్ సన్నివేశాల్లో నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు కాస్త ఆండ్రియా పై తీవ్ర విమర్శలకు కారణం అయ్యాయి. అవకాశాల కోసం ఇలాంటి పనులు అవసరమా ఆండ్రియా అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
పియానో ఆర్టిస్ట్ అయిన ఆండ్రియా తన సినీ కెరీర్ ను గాయినిగా ప్రారంభించిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను దక్కించుకుంది. ప్రస్తుతం ఆండ్రియా చేతిలో అరడజను సినిమాలు ఉన్న విషయం తెల్సిందే.
ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ నిర్మాణంలో రూపొందుతున్న అనల్ మేల్ పణితులి చిత్రంలో ఆండ్రియా ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఆండ్రియా అర్థ నగ్నంగా కనిపించబోతుందని యూనిట్ సభ్యులు లీక్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఆమె విషయమై తెగ ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఆండ్రియా మాట్లాడుతూ.. ఔను తాను అర్ధ నగ్నంగా నటించిన మాట వాస్తవం. అయితే న్యూడ్ గా నటిస్తే తప్పేంటి. అలాంటి సంఘటనలు నిజ జీవితంలో చాలానే జరిగాయి. వాటన్నింటితో పోల్చితే ఇది చాలా తక్కువే అన్నట్లుగా ఆమె పేర్కొంది. మొత్తానికి ఆండ్రియా న్యూడ్ సన్నివేశాల విషయం వైరల్ అవుతోంది.