Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 కొత్త హోస్ట్ షాక్..!

బిగ్ బాస్ సీజన్ 7 పూర్తై సీజన్ 8 కి రెడీ అవుతుంది ఇలాంటి టైం లో హోస్ట్ మారుతున్నాడని లేటెస్ట్ టాక్.

By:  Tupaki Desk   |   7 Aug 2024 10:53 AM GMT
బిగ్ బాస్ 8 కొత్త హోస్ట్ షాక్..!
X

బిగ్ బాస్ సీజన్ 7 పూర్తై సీజన్ 8 కి రెడీ అవుతుంది ఇలాంటి టైం లో హోస్ట్ మారుతున్నాడని లేటెస్ట్ టాక్. స్వయంగా ప్రస్తుతం హోస్ట్ గా చేస్తున్న ఆ స్టార్ తను ఇక మీదట బిగ్ బాస్ హోస్ట్ చేయడం కుదరట్లేదని చెప్పడం షాక్ ఇచ్చింది. దాంతో బిగ్ బాస్ సీజన్ 8 కి ఎవరిని హోస్ట్ గా తీసుకోవాలా అన్న సందిగ్ధంలో పడ్డారు బిగ్ బాస్ టీం. ఏంటి తెలుగు బిగ్ బాస్ కి కింగ్ నాగార్జున గుడ్ బై చెబుతున్నారా అంటే ఇది తెలుగు బిగ్ బాస్ న్యూస్ కాదు తమిళ్ బిగ్ బాస్ అప్డేట్ అని తెలుస్తుంది.


బిగ్ బాస్ తెలుగు కి సమానంగా తమిళ్ లో కూడా 7 సీజన్లు పూర్తి చేసుకుంది. అక్కడ బిగ్ బాస్ హోస్ట్ గా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నారు. ఇక్కడ కింగ్ నాగార్జున లానే అక్కడ కమల్ హాసన్ తన హోస్టింగ్ టాలెంట్ తో అదరగొట్టేస్తున్నారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 కి కమల్ హాసన్ హోస్ట్ గా కొనసాగించట్లేదని ప్రకటించారు. వరుస కమిట్మెంట్స్ వల్ల బిగ్ బాస్ హోస్ట్ చేయలేనని చెప్పి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు కమల్ హాసన్.

ఐతే మన దగ్గర కింగ్ తప్ప మరొకరు లేరు అన్నట్టుగానే అక్కడ కమల్ హాసన్ మాత్రమే బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తూ వచ్చారు. ఐతే మన దగ్గర బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్ టీ ఆర్ మొదలు పెట్టాడు. సెకండ్ సీజన్ నాని చేశాడు. ఇక 3వ సీజన్ నుంచి నాగార్జున కొనసాగుతున్నాడు. నాగ్ కాకుండా మరొకరు ఎవరైనా చేస్తారా అంటే మాత్రం నో ఛాన్స్ అనేస్తారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే తమిళ్ బిగ్ బాస్ కి ఇన్నాళ్లు కమల్ హోస్ట్ గా కొనసాగించగా ఇప్పుడు ఆయన డ్రాప్ అవుతున్నారు.

అందుకే బిగ్ బాస్ తమిళ్ కు కొత్త హోస్ట్ ని వెతుకుతున్నారు. ఐతే వారికి ఒక ఆప్షన్ దొరికినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ హోస్ట్ గా శింబుని తీసుకునే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ టీం. శింబు కూడా ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. కోలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న శింబు సినిమాలను తగ్గించాడు. ఐతే బిగ్ బాస్ హోస్ట్ గా మళ్లీ కెరీర్ స్ట్రాంగ్ చేసుకోవాలని చూస్తున్నాడు శింబు. మరి అతన్ని ఫైనల్ చేస్తారా లేదా మరో ఆప్షన్ కు వెళ్తారా అన్నది త్వరలో తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు మాత్రం నాగార్జున హోస్ట్ గా త్వరలో ప్రారంభం కానుంది.