Begin typing your search above and press return to search.

కాకి ముక్కుకి దొండ‌పండు ఏంటి అన్నారు!

కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ నేడు పాన్ ఇండియాలో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Sep 2023 1:30 AM GMT
కాకి ముక్కుకి దొండ‌పండు ఏంటి అన్నారు!
X

కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ నేడు పాన్ ఇండియాలో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. `జ‌వాన్` విజ‌యం తో అట్లీ పేరు మారుమ్రోగిపోతుంది. అట్లీ కెరీర్ లోనే తొలి 1000 కోట్ల వ‌సూళ్లు సినిమా జ‌వాన్ అవ్వ‌డంతో! ఆ యంగ్ మేక‌ర్ వైపే స్టార్ హీరోలంతా చూస్తున్నారు. 36 ఏళ్ల వ‌య‌సులోనే ఈ అరుదైన రికార్డు సాధించ‌డం విశేషం. ఇక ద‌ర్శ‌కుడిగా ఇప్ప‌టివ‌ర‌కూ అట్లీకి ఫెయిల్ అనేది లేదు. `రాజారాణి`తో ద‌ర్శ‌కుడిగా మొద‌లై! `తేరి`..`మెర్స‌ల్`..`బిగిల్` తో వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్నాడు.

భ‌విష్య‌త్ లో మ‌రింత సంచ‌ల‌నంగానూ మార‌నున్నాడు. మ‌రి ఈ యంగ్ డైరెక్ట‌ర్ తెలుగింట అల్లుడు అంటే ఎవ‌రైనా న‌మ్ముతారా? అంటే న‌మ్మాల్సిందే. అవును అట్లీ తెలుగింట అల్లుడే. సీరియ‌ల్స్ లో హీరోయిన్ గా న‌టించే కృష్ణ‌ప్రియ‌-అట్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కృష్ణ‌ప్రియ‌ది చెన్నైలో స్థిర‌ప‌డ్డ తెలుగు కుటుంబం. తెలుగు వారైన ఆ కుటుంబం చాలా కాలం క్రితమే చెన్నైలో స్థిర‌ప‌డ్డారు. వాళ్లింట్లో తెలుగు ఎంతో చ‌క్కాగా మాట్లాడుతారు.

అట్లీ-ప్రియ‌ల పెళ్లి మాత్రం కొంత యాదృశ్చిక‌మ‌నే చెప్పాలి. ప్రియ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న స‌మ‌యంలో అట్లీ నా జాత‌కం కూడా ఇస్తాను చూడండి అని స్నేహితులంతా ఉన్న స‌మ‌యంలో అన్నాడుట‌. దీంతో ప్రియ ఇంటికెళ్లాక ఎందుక‌లా అన్నావ్ అని అడిగిందిట‌. ఉన్న‌దే చెప్పాను అన్నాడు. దీంతో కొన్ని నిమిషాల మౌనంగా ఉన్న ప్రియ ఇంట్లో మాట్లాడుతాను అని చెప్పిందిట‌.

కానీ ఆమె ఏం మాట్లాడిందో తెలియ‌దు గానీ ఇంట్లో పెళ్లికి మాత్రం వెంట‌నే అంగీక‌రించారుట‌. అదే స‌మ‌యంలో విజ‌య్ తో `తేరి` సినిమా ఒకే అయిందిట‌. అదే స‌మ‌యంలో విజ‌య్ వ్య‌తిరేక వ‌ర్గం అట్లీ రంగు పై ఇష్టాను సారం కామెంట్లు చేసారుట‌. కాకి ముక్కుకి దొండ పండు ఏంట‌ని కామెంట్ చేసారుట‌. అలాగే త‌మ‌ది కులాంత‌ర వివాహ‌మ‌ని అట్లీని ఎగ‌తాళి చేసారుట‌. సోష‌ల్ మీడియాలో ఇష్టాను కామెంట్లు..ప్ర‌త్యేక పేజీలు క్రియేట్ చేసి మ‌రి దాడి చేసారుట‌. అయితే ఇలాంటి వాటిని అట్లీ ఏ రోజు ప‌ట్టించుకోలేద‌టు. అలాగ‌ని ఇప్పుడా వెక్కిరింపులు ఆగ‌లేదంటున్నాడు. జ‌వాన్ వ‌ర‌కూ రంగు గురించి మాట్లాడుతూనే ఉన్నార‌ని అట్లీ అన్నాడు.