Begin typing your search above and press return to search.

బాక్స్ ఆఫీస్.. ధనుష్ పై శివకార్తీకేయన్ ఎఫెక్ట్

ధనుష్ హీరోగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం కెప్టెన్ మిల్లర్

By:  Tupaki Desk   |   16 Jan 2024 4:21 AM GMT
బాక్స్ ఆఫీస్.. ధనుష్ పై శివకార్తీకేయన్ ఎఫెక్ట్
X

ధనుష్ హీరోగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా థియేటర్స్ లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 8.8 కోట్ల నెట్ వరకు కలెక్ట్ చేసింది. పాజిటివ్ స్పందన రావడంతో కలెక్షన్స్ రెండో రోజు నుంచి పెరుగుతాయని అందరూ భావించారు.

నాలుగో రోజు కెప్టెన్ మిల్లర్ కలెక్షన్స్ 6.50 కోట్ల వరకు వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఊహించని విధంగా కలెక్షన్స్ డ్రాప్ కనిపిస్తోంది. రెండో రోజు ఈ మూవీ కేవలం 7.55 కోట్ల నెట్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు మరింత డ్రాప్ అయ్యి 7.40 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. ఓ విధంగా కలెక్షన్స్ రోజు రోజుకి డ్రాప్ అవుతూ వస్తున్నాయి.

అదే రోజు రిలీజ్ అయిన శివ కార్తికేయన్ అయలాన్ మూవీ మాత్రం కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. ఈ మూవీ మొదటి 3.20 కోట్లు కలెక్ట్ చేసింది. రెండో రోజు 4.34కోట్లు వసూళ్లు సాధించింది. నాలుగో రోజు మరింత పెరిగి 5.50 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. నాలుగో రోజు 6.7 5కోట్ల వరకు నెట్ కలెక్ట్ అయినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇలా ఓవరాల్ గా చూసుకుంటే కెప్టెన్ మిల్లర్ కలెక్షన్స్ తగ్గుతూ వస్తుంటే అయలాన్ మూవీ మాత్రం రోజు రోజుకి ప్రేక్షకాదరణ పెంచుకుంటూ మంచి వసూళ్ళని రాబడుతోంది. దీనికి కారణం కెప్టెన్ మిల్లర్ పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో వచ్చిన మూవీ కాగా ఆయలాన్ సైన్స్ ఫిక్షన్స్ అండ్ కామెడీ యాక్షన్ కథతో వచ్చింది.

ఈ కారణంగానే ఫెస్టివల్ సందర్భంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయలాన్ సినిమాని కుటుంబంతో కలిసి వెళ్లి చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా క్రమంగా పెరుగుతున్నాయి. మరి ఫైనల్ గా ఈ రెండింటిలో ఏ మూవీ ఎక్కువ వసూళ్లు సాధించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది అనేది చూడాలి.