సునీల్.. ఇన్నాళ్ళకు మళ్ళీ బిజీబిజీగా..
ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా ఛాన్స్‌లు దక్కుతున్నాయి. తమిళ సినిమాల్లో యాక్టింగ్ పరంగానే కాకుండా, లుక్స్ విషయంలోనూ వేరియేషన్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు.
By: Tupaki Desk | 21 Sep 2023 6:14 AM GMTసీనియర్ నటుడు సునీల్ కెరీర్ జర్నీ గురించి అందరికీ తెలిసిందే. కమెడియన్‌గా కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉండగా హీరోగా అవకాశాలు రావడం వల్ల రూట్ మార్చి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నించాడు. కానీ అది బోల్తా కొట్టింది. 'అందాల రాముడు', 'మర్యాదరామన్న', 'పూల రంగడు' చిత్రాలతో హీరోగా ఒక దశ వరకు పర్వాలేదనిపించేలా సాగిన ఆయన కెరీర్ ఆ తర్వాత అమాంతం ఫ్లాప్‌లతో కెరీర్ డౌన్ స్టేజ్‌కు వెళ్లిపోయారు.
కమెడియన్‌గా సక్సెస్ అయినంత రేంజ్లో హీరోగా సక్సెస్ అందుకోలేకపోయాడు సునీల్. ఓ దశలో అటు హీరోగా సెట్ అవ్వలేక.. ఇటు కామెడీ పాత్రలను ఒప్పుకోలేక చాలా ఇబ్బందే పడ్డాడు. దీంతో మళ్లీ రూటు మార్చిన సునీల్ విలక్షణ నటుడిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అలా కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో త్వరగానే కుదురుకున్నాడు.
తెలుగులో కీలక రోల్స్, ఎక్కువగా విలన్ పాత్రలను చేస్తూ జోరందుకున్నాడు. అలా ఫామ్ అందుకున్న అతడికి సౌత్ ఇండస్ట్రీలోని ఇతర భాషల నుంచి ఆఫర్స్ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా ఛాన్స్‌లు దక్కుతున్నాయి. తమిళ సినిమాల్లో యాక్టింగ్ పరంగానే కాకుండా, లుక్స్ విషయంలోనూ వేరియేషన్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు. జైలర్, మావీరన్, మార్క్ ఆంటోని చిత్రాలు చూస్తే ఈ విషయం పక్కాగా అర్థమవుతుంది. ఆయన నటనకు, లుక్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇక కార్తి జపాన్ సినిమాలోనూ నటించారు.
ఒకరంగా చెప్పాలంటే కోలీవుడ్ ఆయనకు మంచి పాపులారిటీ, స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. సునీల్ రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిపోయిందని తెలిసింది. ఇక పుష్ప 2తో పాన్ ఇండియా యాక్టర్‌గా కూడా మారిపోనున్నాడు సునీల్. వచ్చే ఏడాది పంద్రాగస్ట్‌కు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఆయన పాత్రకు మంచి స్కోప్ దక్కితే సునీల్ కెరీర్ గ్రాఫ్ మరింత మారిపోతుంది.
మరిన్ని పాన్ చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం ఖాయమే! మొత్తంగా సునీల్ కెరీర్ జర్నీని గమనిస్తే.. రీజనల్ యాక్టర్ అనే ట్యాగ్ లైన్‌ను బ్రేక్ చేసుకుని.. పాన్ సౌత్ యాక్టర్‌గా మారిపోయారని పక్కాగా చెప్పొచ్చు. ప్రస్తుతం సునీల్ సినిమాల విషయానికొస్తే.. ఆయన కార్తి జపాన్, అల్లు అర్జున్ పుష్ప 2, ఈగాయ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, మహేశ్ బాబు గుంటూరు కారం చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలన్నీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవాకశాలు ఉన్నాయి.