Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీపై ఎందుకు ఇంత కోపం సీఎం గారు?

ఎప్పుడైతే సినిమా స్టార్స్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారో అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు మొదలు అయ్యాయి.

By:  Tupaki Desk   |   16 Sep 2023 4:48 AM GMT
ఇండస్ట్రీపై ఎందుకు ఇంత కోపం సీఎం గారు?
X

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలతో సంబంధం ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సినిమా స్టార్స్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారో అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు మొదలు అయ్యాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరిని రాజకీయంగా టార్గెట్‌ చేయడం కోసం ప్రభుత్వాలు మొత్తం సినిమా ఇండస్ట్రీ ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయం పక్కన పెడితే ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ పై స్టాలిన్ ప్రభుత్వం ఆంక్షలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాల బెనిఫిట్ షో లు మిడ్ నైట్ షో లతో తమిళ్ నిర్మాతలకు కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. ఇప్పుడు ఆ ఆదాయానికి గండి కొట్టింది తమిళ ప్రభుత్వం.

ఇటీవల విడుదల అయిన జైలర్ సినిమా తో పాటు ఇక ముందు రాబోతున్న లియో తో పాటు ఇతర స్టార్‌ హీరోల సినిమాలకు మిడ్ నైట్ షో లు, బెనిఫిట్ షో లు ఉండబోవు. ప్రభుత్వం వాటిని పూర్తిగా నిషేదించింది. ప్రభుత్వ నిర్ణయం పై స్టార్‌ హీరోల అభిమానులు తీవ్ర ఆగ్రహం ను వ్యక్తం చేస్తున్నారు.

తమిళ సినీ ఇండస్ట్రీలోని కొందరిని టార్గెట్ చేయడం కోసం స్టాలిన్ ప్రభుత్వం మొత్తం ఇండస్ట్రీ వారిపై ఆంక్షలు పెట్టడం ఏమాత్రం సబబు కాదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ వర్గాల వారు మాత్రం మిడ్ నైట్ షో లు, బెనిఫిట్ షో ల కారణంగా పబ్లిక్ చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారనే ఉద్దేశ్యంతో బ్యాన్ చేసినట్లు చెబుతున్నారు. అంతే తప్ప రాజకీయ ఉద్దేశ్యం ఏమీ లేదని వారు అంటున్నారు.

తమిళ సినీ ప్రేమికులు మాత్రం సీఎం గారు ఎందుకు ఇండస్ట్రీ పై ఇంత కోపం అంటూ సోషల్ మీడియా ద్వారా బెనిఫిట్ షో ల కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ముందు ముందు అయినా ముఖ్యమంత్రి గారి మనసు మారి ఆంక్షలను తొలగిస్తాడేమో చూడాలి.