Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో త‌మిళ టైటిల్ దుమారం!

ఏ భాష‌లో సినిమా రిలీజ్ అయినా ఆ భాష‌కు త‌గ్గ‌ట్టు టైటిల్ అదే భాష‌లో పెట్టి రిలీజ్ చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   29 Oct 2023 11:30 AM GMT
టాలీవుడ్ లో త‌మిళ టైటిల్ దుమారం!
X

ఏ భాష‌లో సినిమా రిలీజ్ అయినా ఆ భాష‌కు త‌గ్గ‌ట్టు టైటిల్ అదే భాష‌లో పెట్టి రిలీజ్ చేస్తుంటారు. చివ‌రి కి హాలీవుడ్ సినిమాలు కూడా తెలుగు టైటిల్స్ తోనే రిలీజ్ అవుతుంటాయి. చాలా రేర్ గానే మాతృక టైటిల్ తో రిలీజ్ అవుతుంటాయి. టైటిల్ లో క్యాచీనెస్ కోల్పోతుంద‌నే భావ‌న క‌ల్గిన‌ప్పుడు త‌ప్ప‌క రిలీజ్ చేయాల్సిన సంద‌ర్భాల్లో అలా మాతృక టైటిల్ తో రావాల్సి వ‌స్తుంది.

అయితే అర‌వ సినిమాల‌కి మాత్రం తెలుగు మార్కెట్ కావాలి....తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు త‌మ సినిమా టికెట్ కొనాలి గానీ..తెలుగు టైటిల్ మాత్రం చేదు అంటున్న‌ట్లే తాజా స‌న్నివేశం క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో కొన్ని సినిమాలు తెలుగులో మాతృక టైటిల్ తోనే రిలీజ్ అవుతున్నాయి. సూర్య హీరోగా న‌టిస్తోన్న పీరియాడిక్ చిత్రం `కంగువా` చిత్రాన్ని అదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్ర నిర్మాణంలో తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ కూడా భాగ‌మైంది. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో సినిమా నిర్మాణ జ‌రుగుతుంది. కానీ ఈ సినిమా త‌మిళ్ టైటిల్ తోనే టాలీవుడ్ ఆడియ‌న్స్ ముందుకు రాబోతుంది. అంత‌కు ముందు సూర్య న‌టించిన `ఈటీ` కూడా అదే టైటిల్ తో రిలీజ్ అయింది. అలాగే యంగ్ హీరో శివ‌కార్తికేయ‌న్ హీరోగా `అల‌యాన్` అనే సినిమా తెర‌కెక్కుతోంది.

ఇది కూడా మాతృక టైటిల్ తోనే తెలుగులో రిలీజ్ అవుతుంది. ఇటీవ‌లి కాలంలో శివ కార్తికేయ‌న్ సినిమాల‌కు తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ అయింది. అయినా స‌రే అర‌వ టైటిల్ తోనే వ‌స్తామంటున్నారు. విక్ర‌మ్ హీరోగా పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ` తాంగ‌లాన్` అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఇదోక పీరియాడిక్ చిత్రం. స్టూడియో గ్రీన్- నీలం ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్త‌గా నిర్మిస్తున్నాయి.

గ‌తంలో స్టూడియో గ్రీన్ నుంచి చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. వాటిలో చాలా చిత్రాలు తెలుగు టైటిల్ తోనే రిలీజ్ అయ్యాయి. కానీ తాజా చిత్రాన్ని మాత్రం త‌మిళ్ టైటిల్ తోనే రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే ప్ర‌భుదేవా కూడా `ఉల్ప` అనే త‌మిళ టైటిల్ తోనే త‌న చిత్రాన్ని తెలుగు ఆడియ‌న్స్ ముందుకు తెస్తున్నారు.

దీంతో త‌మ బ్రాండ్ ని తెలుగులో బలంగా చాటాల‌నే ఉద్దేశంతోనే సొంత టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు? అన్న విమర్శ తెర‌పైకి వ‌స్తోంది. తెలుగు సినిమా పాన్ ఇండియాలో స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో తంబీలు తెలుగు టైటిల్ పెట్ట‌కుండా రావ‌డం వెనుక ఎత్తుగ‌డ ఏంటి? అన్న‌ది చ‌ర్చ‌కొస్తుంది