Begin typing your search above and press return to search.

మ‌హిళ మృతికి బ‌న్నీ నైతిక బాధ్య‌త వ‌హించాల్సిందే! త‌మ్మారెడ్డి

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన మ‌హిళ మృతి ఘ‌ట‌న విష‌యంలో? అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వ‌డం..అంత‌కు ముందు హైడ్రామా తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Dec 2024 7:19 AM GMT
మ‌హిళ మృతికి బ‌న్నీ నైతిక బాధ్య‌త వ‌హించాల్సిందే! త‌మ్మారెడ్డి
X

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన మ‌హిళ మృతి ఘ‌ట‌న విష‌యంలో? అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వ‌డం..అంత‌కు ముందు హైడ్రామా తెలిసిందే. అరెస్ట్ అయిన అనంత‌రం అర్ద‌గంట‌లో మ‌ధ్యంతర బెయిల్ వ‌చ్చినా? రాత్రంతా జైల్లో ఉంచి ఉద‌యాన్ని విడుద‌ల చేయ‌డంపై తీవ్ర స్థాయిలో పోలీసుల తీరుపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఈ నేప‌థ్యంలో బ‌న్నీకి మ‌ద్దుతుగా అభిమానులంతా నిలిచారు. యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ బ‌న్నీ కోసం క‌దిలింది. విడుద‌ల అనంత‌రం ఇంటికొచ్చిన బ‌న్నీని సెల‌బ్రిటీలంతా క‌లిసి ప‌రామ‌ర్శించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అరెస్ట్ ను ఖండించారు.

బాలీవుడ్ నుంచి సానుభూతి వ్య‌క్తమైంది. జాతీయ మీడియా సైతం బ‌న్నీకి మ‌ద్ద‌తుగా నిలిచింది. చ‌నిపోయిన వారం త‌ర్వాత అరెస్ట్ అవ్వ‌డం? గోదావ‌రి పుష్క‌రాల ఘ‌ట‌న‌లో అరెస్ట్ లు ఎందుకు జ‌ర‌గ‌లేదు? అంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కొచ్చింది. అంత‌కు ముందు ప‌లువురు హీరోల అభిమానుల విష‌యంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు గుర్తు చేసారు. అయితే తాజాగా బ‌న్నీ అరెస్ట్ విష‌యంలో ద‌ర్శ‌క‌, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్పందించారు.

బ‌న్నీని అరెస్ట్ చేయ‌డం క‌రెక్టేనా? అని యాంక‌ర్ అడిగితే?..` ఆయ‌న ఇలా స్పందించారు. `అల్లు అర్జున్ జాతీయ అవార్డు సాధించినంత మాత్రాన త‌ప్పు చేయోచ్చ‌ని కాదు. త‌ప్పు చేసినా మ‌న్నించాల‌ని కూడా కాదు. నేష‌న‌ల్ అవార్డు సాధించాను. మ‌ర్డ‌ర్ చేస్తాను అంటే ఒప్పుకుంటారా? దీనికి, దానికి సంబంధం లేదు. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో మ‌హిళ మృతికి అల్లు అర్జున్ కి నేరుగా సంబంధం లేక‌పోవ‌చ్చు. కానీ ఘ‌ట‌న‌కు అత‌డు నైతిక బాధ్య‌త వ‌హించాల్సిందే.

బ‌న్నీ అక్క‌డ‌కు వెళ్లి ర్యాలీ చేయ‌డం వ‌ల్లే తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఇందులో పోలీసులు, థియేట‌ర్ యాజ‌మాన్యం వైఫ‌ల్యం కూడా ఉంది. అలాగ‌ని బ‌న్నీకి ఈ ఘ‌ట‌న‌తో సంబంధం లేద‌ని చెప్ప‌లేం. అత‌డి అరెస్ట్ విష‌యంలో పోలీసులు త‌మ విధిని నిర్వ‌హించారు. ఈ సినారేలో పోలీసుల్ని త‌ప్పుబ‌ట్టాల్సిన ప‌నిలేదు` అని అన్నారు. ఈ ఘ‌ట‌న విష‌యంలో బ‌న్నీ ఇప్ప‌టికే బాధిత మ‌హిళ కుటుంబానికి 25 ల‌క్ష‌లు అందించారు. ఆ కుటుంబానికి తానెప్పుడు అండ‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.