Begin typing your search above and press return to search.

సినిమాల కోసం నాన్న జేబులో డ‌బ్బులు కొట్టేసేవాడిని!

మాది చాలా పెద్ద ఫ్యామిలీ . ఏడుగురం అన్నదమ్ములం . నాన్న జీతం 750 రూపాయలు. అందువలన సహజంగానే ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు ఉండేవి

By:  Tupaki Desk   |   1 Sep 2023 2:30 AM GMT
సినిమాల కోసం నాన్న జేబులో డ‌బ్బులు కొట్టేసేవాడిని!
X

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ న‌టుడు త‌నికెళ్ల భ‌ర‌ణి ప్ర‌స్తానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిన గొప్ప న‌టుడాయ‌న‌. ఎంతో మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌కు భ‌ర‌ణి రోల్ మోడ‌ల్ లాంటి వారు. ర‌చ‌యిత‌గానూ ఆయ‌న అనుభ‌వం అన‌న్య సామన్య‌మైన‌ది. పెద్ద ద‌ర్శ‌క‌-ర‌చ‌యిత అవ్వాల‌నుకున్న భ‌ర‌ణి అనుకోకుండా న‌టుడ‌య్యారు. ఆ త‌ర్వాత మ్యాక‌ప్ వేసుకునే కొన‌సాగించారు.

ఆయ‌న న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు అభిమానం చూపించారు. ఆర‌కంగా కొన్ని ద‌శాబ్ధాలుగా ప్రేక్ష‌కుల్ని అల‌రి స్తున్నారు. నేటి త‌రం హీరోల‌తోనూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా త‌నికెళ్ల భ‌ర‌ణి ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న కెరీర్ జ‌ర్నీని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. అవేంటో ఆయ‌న మాట‌ల్లోనే...

'మాది చాలా పెద్ద ఫ్యామిలీ . ఏడుగురం అన్నదమ్ములం . నాన్న జీతం 750 రూపాయలు. అందువలన సహజంగానే ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు ఉండేవి. నేను ఏడో తరగతికి వచ్చేవరకూ నాకు చెప్పులు కొనడానికి కూడా మా నాన్న దగ్గర డబ్బులు ఉండేవి కాదు. కూరగాయలు కొనడానికి వెళ్లేటప్పుడు నేను మా నాన్న వెంటే వెళ్లేవాడిని. ఒకసారి అలా వెళుతున్నప్పుడు ఒక చెప్పుల షాపు దగ్గర.. కావాలనే నేను కాలుతున్న సిగరెట్ పై కాలువేసి పెద్దగా అరిచాను. అప్పుడు మా నాన్న బాధపడి .. ఆ పక్కనే ఉన్న షాపులోకి తీసుకుని వెళ్లి చెప్పులు కొని పెట్టారు.

కానీ ఆయన ఆ మాత్రం చూసుకోవా 'వెధవా' అంటూ రెండు దెబ్బ‌లు వేసాడు. మధ్యతరగతిలో ఉండటం .. మధ్య తరగతివాడిగా బ్రతకడం మా నాన్న మాకు నేర్పారు. ఆయన చాలా కష్టాలు పడ్డారు . కానీ ఎప్పుడూ కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడలేదు. నేను ఎక్కువగా ఆకతాయి పనులు చేసేవాడిని. సినిమాలు చూడటం కోసం మా నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని. అది తెలిసి ఆయన నన్ను కొట్టేవాడు. ఇలాంటి అల్ల‌రి ప‌నులెన్నో నాలో ఉన్నాయి' అని అన్నారు.