షూటింగ్ స్పాట్ లో కొండపై నుంచి జారిపడిన నటి!
బాలీవుడ్ నటి తానీషా ముఖర్జీ సుపరిచితమే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన `కంత్రి` సినిమాలో సెకెండ్ లీడ్ పోషించింది.
By: Tupaki Desk | 19 April 2024 5:37 AM GMTబాలీవుడ్ నటి తానీషా ముఖర్జీ సుపరిచితమే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన `కంత్రి` సినిమాలో సెకెండ్ లీడ్ పోషించింది. తెలుగులో నటించింది ఈ ఒక్క చిత్రంలోనే. తమిళ్..హిందీ కొన్ని సినిమాల్లో నటించింది. ఇప్పటికీ అక్కడ యాక్టివ్ గానే పనిచేస్తోంది. బిగ్ బాస్ సీజన్ -7లోనూ పాల్గొంది. అయితే సినిమాల మీద తనకున్న మక్కువతో ఏకంగా బ్రెయిన్ డెడ్ అయిందనే విషయాన్ని సైతం దాచి పెట్టిందన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అదేంటో ఆమె మాటల్లోనే..
`నా మొదటి సినిమా ‘ష్’ షూటింగ్ లో భాగంగా ఓ ఎత్తైన కొండపై సీన్ చిత్రీకరిస్తున్నారని.. ఆ సమయంలో నేను ఆ ఎత్తైన కొండపై నుంచి జారి కింద పడ్డాను. ఆ సమయంలో నా తలకు బలమైన గాయమైంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని అన్నారు. సంవత్సరం పాటు చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగాను. మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఏడాది పట్టింది. అయితే అప్పుడు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అదే మొదటి సినిమా కాబట్టి.. చెప్తే ఎక్కడ నన్ను సినిమాలోంచి తొలగిస్తారో అన్న భయంతో బ్రెయిన్ డ్యామేజ్ విషయాన్ని దాచిపెట్టాను.
ఆ గాయంతో బాధపడుతూనే షూటింగ్ లో పాల్గొనేదాన్ని. రెండు గంటలు షూట్ జరిగితే మూడు గంటలు రెస్ట్ తీసుకునేదాన్ని. బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా యాక్టివ్ గా ఉండలేకపోయేదాన్ని. ఆసమయంలో నిర్మాతలు ఎంతో సహకరిచారు కాబట్టే ఆ సినిమా పూర్తి చేయగలిగాను. కానీ ప్రమాదం తర్వాత మునుపటి లా షూటింగ్ చేయలేక పోయేదాన్ని . ఆ పాత్రకు అందుకే పూర్తిగా న్యాయం చేయలేకపోయాను. బరువు కూడా పెరిగాను. సినిమాలో కొన్ని చోట్ల ఎక్స్ ప్రెషన్స్ వేగంగా పలికించలేకపోయాను.
అందుకే నాకు యాక్టింగ్ రాదు అని విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల్ని కొట్టిపారేయను. ఎందుకంటే నటిగా మొదలైన తర్వాత నా వ్యక్తిగత విషయాలు ప్రేక్షకులకు అనవసరమైనవి. పైగా నా సమస్య కూడా వాళ్లకు చెప్పలేదు కాబట్టి విమర్శల్ని అంగీకరించాను` అని తెలిపింది. ప్రస్తుతం తానీషా `లవ్ యూ శంకర్` అనే సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో టీవీ షోలను అమ్మడు హోస్ట్ చేస్తోంది.