Begin typing your search above and press return to search.

అగ్నిహోత్రిపై త‌నూశ్రీ ద‌త్తా ఆరోప‌ణ‌లు

ఈ త్రో బ్యాక్ ఇంట‌ర్వ్యూలో త‌నూశ్రీ దత్తా సినిమా చిత్రీకరణ సమయంలో తన విష‌యంలో వివేక్ అగ్నిహోత్రి ఎలా అనుచితంగా ప్రవర్తించారో చర్చించారు.

By:  Tupaki Desk   |   18 Aug 2024 3:52 AM GMT
అగ్నిహోత్రిపై త‌నూశ్రీ ద‌త్తా ఆరోప‌ణ‌లు
X

సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ త‌న‌ను వేధించాడని త‌నూశ్రీ ద‌త్తా గ‌తంలో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అటుపై నానా ప‌టేక‌ర్‌పై పోలీస్ విచార‌ణ సాగింది. చాలా కాలం పాటు సైలెంట్ గా ఉన్న నానా ప‌టేక‌ర్ ఇటీవ‌లే త‌నూశ్రీ ఆరోప‌ణ‌లు అర్థం లేనివిగా కొట్టి పారేసాడు. ఆమె విష‌యంలో ఏం లేదు కాబ‌ట్టే తాను సైలెంట్ గా ఉన్నాన‌ని అన్నాడు. కానీ విచార‌ణ‌లో త‌న‌కు ఎలాంటి న్యాయం జ‌ర‌గ‌లేద‌ని త‌నూశ్రీ ద‌త్తా ఇంత‌కుముందు ఆవేద‌న చెందింది.

ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రి వంతు. అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 2005 చిత్రం 'చాక్లెట్‌'లో త‌నూశ్రీ న‌టించింది. అయితే సెట్‌లో ఉన్న‌ప్పుడు అత‌డు త‌న‌ను తీవ్రంగా తిట్టేవాడ‌ని, అవ‌మానించేవాడ‌ని త‌నూశ్రీ ఆరోపించింది. త‌న‌కు ఎదురైన‌ ఇబ్బందికరమైన అనుభవాలను షేర్ చేసిన త్రోబ్యాక్ వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ గా మారింది. సస్పెన్స్ థ్రిల్లర్ చాక్లెట్‌లో అనిల్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, అర్షద్ వార్సీ వంటి టాప్ స్టార్లు ఉన్నారు. అలాంటి టీమ్ తో తాను ప‌ని చేసాన‌ని త‌నూశ్రీ తెలిపింది. ఈ త్రో బ్యాక్ ఇంట‌ర్వ్యూలో త‌నూశ్రీ దత్తా సినిమా చిత్రీకరణ సమయంలో తన విష‌యంలో వివేక్ అగ్నిహోత్రి ఎలా అనుచితంగా ప్రవర్తించారో చర్చించారు.

సెట్‌కి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా త‌నూశ్రీకి తిట్లు ప‌డేవి. ఆల‌స్య‌మైన ప్ర‌తిసారీ వివేక్ అగ్నిహోత్రి నుండి తీవ్ర ప్రతిస్పందనను ఎదుర్కొంది. లైట్లు లేదా సెటప్ సిద్ధంగా లేకున్నా ఇంకా సిద్ధం అవుతున్న సెట్‌కి తాను సమయానికి వచ్చినా కానీ ఏదో ఒకసారి కొంచెం ఆలస్య అయినా కూడా దర్శకుడు త‌న‌ను తిట్టేవాడు. అగ్నిహోత్రి ఆమె రాక సమయాన్ని చెక్ చేయడానికి ప్రత్యేకంగా సెట్‌లో వేచి చూసేవారు. తాను వచ్చినప్పుడు అన్‌ప్రొఫెషనల్ అని తిట్టేవారు.

చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో స‌న్నివేశం గ్యాప్ లో విశ్రాంతి తీసుకోవడానికి ద‌ర్శ‌కుడు అనుమతించలేదని కూడా వివరించింది. ఒక నటిగా షూటింగ్ చేయనప్పుడు తన వ్యాన్‌లో విశ్రాంతి తీసుకోవాలని భావించింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల కోసం తాను ధరించాల్సిన రివీలింగ్ దుస్తులను బట్టి దత్తా తన వ్యాన్‌లో ఉండేందుకు లేదా వస్త్రాన్ని కప్పుకోవడానికి ప్ర‌య‌త్నిస్తే.. దానికి కూడా అనుమతి ల‌భించ‌లేదు. ఆమె ఒక వస్త్రాన్ని ధరించి కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు వివేక్ అగ్నిహోత్రి దానిని తీసివేయమని సూచించాడు. ఎందుకంటే నెక్ట్స్ షాట్ వ‌స్తుంద‌ని అనేవాడు. మొత్తం సిబ్బంది ముందు పొట్టి స్కర్ట్‌లో ఉండవలసి వచ్చినందున అసౌకర్యంగా ఉండేది.

రెడ్డిట్‌లో దీనికి ప్రజలు ప్ర‌తిస్పందించారు. ఇర్ఫాన్ ఖాన్, అర్షద్ వార్సీ ఆమె కోసం ఎలా పోరాడారో పోస్ట్ చేసారు. ఇర్ఫాన్ ఖాన్, సునీల్ శెట్టి కూడా అగ్నిహోత్రితో పోరాడారని.. ఆమెతో నిలబడ్డారని నేను ఎక్కడో చదివాను! అని ఒక‌రు రాసారు. ఇది స్పష్టంగా వేధింపులు, తీవ్ర స్థాయి బెదిరింపుల రూపం అని ఒక నెటిజ‌న్ అన్నారు.