అతడు అబద్ధాల కోరు.. నన్ను చాలా వేధించాడు: తనూశ్రీ
2008లో విడుదలైన 'హార్న్ ఓకే ప్లీజ్' సెట్స్‌లో లైంగికంగా వేధించాడంటూ నానా పటేకర్‌పై తనూశ్రీదత్తా తీవ్రంగా ఆరోపించింది
By: Tupaki Desk | 25 Jun 2024 1:29 PM GMT2008లో విడుదలైన 'హార్న్ ఓకే ప్లీజ్' సెట్స్‌లో లైంగికంగా వేధించాడంటూ నానా పటేకర్‌పై తనూశ్రీదత్తా తీవ్రంగా ఆరోపించింది. తనూశ్రీ నేరుగా నానా పటేకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత ...నిందితుడి(నానా) వల్ల వేధింపులకు గురైన మరో ఇద్దరు మహిళలు ముందుకు వస్తారని తనూశ్రీ న్యాయవాది మీడియాకు తెలిపారు.
2018లో పరిశ్రమలో మీటూ ఉద్యమాన్ని ప్రారంభించిన నటిగా ఆ సమయంలో తనూశ్రీ దత్తా పేరు మార్మోగింది. తనూశ్రీతో పాటు మరెన్నో బాధాకరమైన వేధింపుల కథలు వెలుగు చూసాయి. ది లాలన్‌టాప్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నానా పటేకర్ తనూశ్రీ ఆరోపణలను ఖండించారు. తనూశ్రీ తనపై అబద్ధాలు ప్రచారం చేసిందని వ్యాఖ్యానించారు. అసలు ఏమీ జరగనప్పుడు నేను ఏమని స్పందించాలి? అని నానా ప్రశ్నించారు.
వారణాసి బాలుడిని కొట్టిన సంఘటన తర్వాత నానా పటేకర్ ఎంత పెద్ద అబద్ధాలకోరు అన్నది ప్రపంచానికి తెలిసింది. షూట్‌లో భాగంగానే చిన్నపిల్లవాడిని చెంపదెబ్బ కొట్టాలని ప్రయత్నించినట్టు కవర్ చేయాలని చూసాడు. కానీ అతడి నిజ స్వరూపం తెలిసాక తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. అతడు అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు. అయినా #metoo కి ప్రతిస్పందించడానికి 6 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నాడు? ఎందుకంటే నేను హత్యకు కుట్ర పన్నుతున్నాడని, నేరపూరితమైన బెదిరింపులు, వెంబడించడం, శారీరక హాని కలిగించడం వంటివి చేస్తున్నాడని మరో ఎఫ్.ఐ.ఆర్ ని ఫైల్ చేస్తానని భయపడుతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎక్కడికి వెళ్లినా అపరిచితులు నన్ను అనుసరించారు. భయపెట్టారు. నాకు విచిత్రమైన ప్రమాదాలు ఎదురయ్యాయి. నాపై విష ప్రయోగం చేయాలని ప్రయత్నించాడు. అపరిచితులతో కూడా ప్రమాదకరమైన పరిస్థితులలో నన్ను తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. నాకు ..నా చుట్టూ ఉన్న అందరికీ చాలా విచిత్రమైన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ నేను వీటన్నింటి నుండి బయటపడ్డాను.
అతడు తన ప్లాన్ ప్రకారం నేను చనిపోతానని అనుకున్నాడు.. కానీ నేను బతికిపోయాను. ఇప్పుడు అతడు భయపడి ఏదో ఒక ప్రచారం చేస్తున్నాడు. బాలీవుడ్‌లో అతని(నానా పటేకర్) మద్దతుదారుల సంఖ్య తగ్గిపోయింది. అతడికి మద్దతు ఇచ్చిన వారంతా దివాళా తీసారు.. వారంతా తమ పొజిషన్‌ని కోల్పోయారు లేదా అతడిని పక్కన పెట్టారు. ప్రజలు అతడి అవకతవకలను ఇప్పుడు చూడగలరు. అందుకే ఇప్పుడు అతడు ఇలా మారాడు'' అంటూ ఇన్ స్టాలో సుదీర్ఘమైన నోట్ రాసింది తనూశ్రీ.