Begin typing your search above and press return to search.

#MeToo బాధితురాలికి ఆరేళ్ల‌లో జీరో ఆఫ‌ర్

సీనియ‌ర్ న‌టుడు నానా పటేకర్ త‌న‌పై వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించింది త‌నూశ్రీ ద‌త్తా.

By:  Tupaki Desk   |   2 Oct 2024 6:30 AM GMT
#MeToo బాధితురాలికి ఆరేళ్ల‌లో జీరో ఆఫ‌ర్
X

సీనియ‌ర్ న‌టుడు నానా పటేకర్ త‌న‌పై వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించింది త‌నూశ్రీ ద‌త్తా. హార్న్ ఓకే ప్లీస్స్ సెట్స్‌లో లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించిన స‌మ‌యం(2018)లో #MeToo ఉద్యమం హిందీ చిత్ర పరిశ్రమను కదిలించింది. అనంత‌రం చాలా కాలానికి మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై జస్టిస్ కె హేమ కమిటీ 235 పేజీల నివేదికను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయడంతో ఉద్యమం పతాక శీర్షికలకు ఎక్కింది. మీటూ సినిమా వ్యాపారం తీరుపై చాలా ప్ర‌భావం చూపింది.

ఉద్యమం జరిగి ఆరేళ్లు అవుతున్నా తనుశ్రీకి సెట్‌లో అవకాశం రాలేదు. మలయాళ నటీనటులు, విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ వ్యవస్థాపక సభ్యులు - పార్వతి తిరువోతు, రిమా కల్లింగల్ వంటి వారికి అవకాశాలు కరువ‌వ్వ‌డానికి కార‌ణాల‌ను విశ‌ద‌ప‌రిచారు. ప్ర‌ముఖ మీడియాతో ఒక ప్రత్యేక చాట్‌లో తనుశ్రీ తమ సినిమాల్లో పని చేయడానికి ఇద్దరు #MeToo నిందితులు తనను సంప్రదించారని, అయితే క‌మిట్ మెంట్ కి ఓకే చెప్ప‌కుండా తాను ఆ సినిమాల నుంచి వైదొలిగాన‌ని తెలిపింది. ప్రతి న‌టీమ‌ణి ఒక కారణం కోసం కొంచెం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 2018లో నాకు చాలా పెద్ద నిర్మాత సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ నిర్మాత‌ కొన్ని పెద్ద సినిమాలు చేసాడు. కానీ దర్శకుడు #మీటూ నిందితుడు కావ‌డంతో నేను వెంటనే ఆ అవకాశాన్ని తిరస్కరించాను. దీనివ‌ల్ల నేను చాలా కాలంగా సినిమాలు చేయలేదు అని త‌నూశ్రీ తెలిపారు.

నేను షోలు, బ్రాండ్ ల‌కు ప్ర‌చారం మాత్రమే చేస్తాను. మహిళా సాధికారత గురించిన సినిమాల్లో లీడ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. కానీ #మీటూ సమయంలో అతడి(నానా) పేరుతో తెర‌పైకి వచ్చినందున, నేను ఆ ఆఫర్‌ను స్వీకరించడానికి ఇష్టపడలేదు. అలాంటి ఎపిసోడ్ రెండేళ్ల తర్వాత మళ్లీ ఎదురైంది. ఈ మధ్య నేను కొన్ని మంచి ప్రాజెక్ట్‌లకు సంతకం చేసాను కానీ నన్ను చాలా ఘోరంగా టార్గెట్ చేసారు. నా ప్రాజెక్ట్‌లు నాశనం చేసారు.

గత సంవత్సరం కోల్‌కతాకు చెందిన ఒక దర్శకుడు తిరిగి న‌టిగా కంబ్యాక్ కోసం సహాయపడే సినిమాని ఆఫర్ చేశాడు. కానీ దానిని కూడా తిరస్కరించాన‌ని త‌నూశ్రీ తెలిపింది. నాకు కథ నచ్చింది.. పాత్ర అద్భుతంగా ఉంది. బెంగాలీ చిత్రంతో నా నటనా జీవితాన్ని కొనసాగించడం నాకు గొప్ప అవకాశంగా భావించాను. ఒక వారం తర్వాత, #MeToo సమయంలో అతని పేరు కూడా వచ్చిందని నాకు తెలిసింది. నేను కొన్ని షరతులు కూడా పెట్టాను, దానిని అతను అంగీకరించాడు. కానీ నేను చివ‌రికి ఆ సినిమా చేయ‌లేద‌ని కూడా త‌నూశ్రీ తెలిపింది.