Begin typing your search above and press return to search.

మనమే.. ఈసారి టప్పా టప్పా..

శర్వానంద్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న "మనమే" సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లు ఊపందుకున్నాయి

By:  Tupaki Desk   |   30 May 2024 6:43 AM GMT
మనమే.. ఈసారి టప్పా టప్పా..
X

శర్వానంద్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న "మనమే" సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లు ఊపందుకున్నాయి. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకుడు. ఈ క్రమంలో మూడవ పాట "టప్పా టప్పా" విడుదలైంది. ఈ పాటను "వెడ్డింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్" అని ప్రమోట్ చేశారు, పాటను విన్న తర్వాత అందరూ ఆ అభిప్రాయంతో ఏకీభవించారు. హేశం అబ్దుల్ వహాబ్ ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు.

ఇక అందమైన ట్యూన్స్ కు తగ్గట్టుగా రామ్ మిరియాల మరియు హేశం కలిసి అద్భుతంగా పాడారు, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంటుంది. ఇక పాటలో శర్వానంద్ ఉత్తేజకరంగా కనిపించాడు, అతని స్టైల్, డాన్స్ స్టెప్స్ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. కృతి శెట్టి, విక్రమ్ అదిత్య కూడా ఈ పాటలో కనిపించారు. శివ కందుకూరి మరియు ఆయేషా ఖాన్ పెళ్లి జంటగా ఉన్నారు.

టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని రాంసే స్టూడియోస్ సహకారంతో భారీ ఎత్తున నిర్మించారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రెజెంట్ చేస్తున్నారు. విష్ణు శర్మ మరియు జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. సహ నిర్మాతగా వివేక్ కుచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా కృతి ప్రసాద్ మరియు ఫణి వర్మ వ్యవహరిస్తున్నారు.

ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షైక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి అర్జున్ కార్తీక్, టాగోర్, వెంకీ డైలాగ్స్ అందించారు. "మనమే" సినిమా జూన్ 7న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మొత్తానికి ఈ చిత్ర ప్రమోషన్లు అత్యుత్తమంగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

ఇప్పుడు "టప్పా టప్పా" పాట విడుదలతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి ట్యూన్స్ అందించినా కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తాయి. ఇక ఈసారి మనమే ఆల్బమ్ కూడా ట్రెండ్ సెట్ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. శర్వానంద్, కృతి శెట్టి మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.