Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందే కాబోయేవాడిని ముప్పు తిప్ప‌లు!

అయితే తాప్సీ ప‌న్ను మాథియాస్ బోతో మొద‌టి చూపులోనే ప‌డిపోయిందా? అంటే అలాంటిదేమీ లేద‌ని తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 4:11 AM GMT
పెళ్లికి ముందే కాబోయేవాడిని ముప్పు తిప్ప‌లు!
X

ఈ ఏడాది ప్రారంభంలో తాప్సీ పన్నూ ఇంటర్నెట్‌లో కలకలంగా మారింది. తన దీర్ఘకాల స్నేహితుడు, మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోని ర‌హ‌స్యంగా పెళ్లాడి మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది. ''ఇద్ద‌రికీ గోప్య‌త చాలా అవ‌స‌రం. మేం దీనిని ఇష్ట‌ప‌డ‌తాం!'' అని తాప్సీ ఆ త‌ర్వాత వివ‌ర‌ణ ఇచ్చింది. కేవ‌లం కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో మాథియాస్ ని పెళ్లాడింది. ఈ జంట పెళ్లి నుంచి కొన్ని ఫోటోలు మాత్ర‌మే రివీల‌య్యాయి. వెన్యూకు సంబంధించిన‌ ఒక వీడియో కూడా ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయింది.

అయితే తాప్సీ ప‌న్ను మాథియాస్ బోతో మొద‌టి చూపులోనే ప‌డిపోయిందా? అంటే అలాంటిదేమీ లేద‌ని తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. తాప్సీ పన్నూ మాథియాస్ బోను పరీక్షించడానికి కొంత‌ సమయాన్ని తీసుకున్నాన‌ని తెలిపింది. కాస్మోపాలిటన్ ఇండియాతో ఇంట‌ర్వ్యూలో తాప్సీ పన్నూ తన హబ్బీ మాథియాస్ బో త‌న‌ను ఎందుకు ఆక‌ర్షించాడో వెల్ల‌డించింది. మొదటి చూపులోనే అత‌డిని ఎంచుకోలేదని.. ప్రేమ‌లో ప‌డాల‌నే నిర్ణ‌యానికి ముందే అత‌డిని కొన్ని సార్లు పరీక్షించాన‌ని తెలిపింది. మొదటి చూపులోనే ప్రేమ అనే విచిత్రం త‌న విష‌యంలో లేదు. పూర్తిగా ప్రాక్టికాలిటీ కోసం తాప్సీ టెస్టులు పెట్టింది.

చాలా పరీక్షించాను. అత‌డు క‌చ్చితంగా ఉన్నాడు. ఇది ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ త‌ర‌హా కాదు. నిజంగా ఆచరణాత్మకంగా ఉందో లేదో పరీక్షించడానికి సమయం తీసుకున్నాను ... సంబంధం కుదురుతుందా లేదా అని టెస్ట్ చేసాను. అటుపై అత‌డిని నేను స్పష్టంగా ఇష్టపడ్డాను.. అతడిని గౌరవించాను.. మేము కలుసుకుంటూనే ఉన్నాము..నేను అతడిని ప్రేమిస్తూ పెరిగాను. కాబట్టి ప్రేమలో పడటం ఒక నెలలో లేదా తక్షణమే జరగలేదు.. అని తెలిపింది.

తాప్సీ ప‌న్ను బాలీవుడ్ లో వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. సౌత్ లో ఈ అమ్మ‌డి ప‌ప్పులు అంత‌గా ఉడ‌క్క‌పోయినా కానీ బాలీవుడ్ లో ఆశించిన స్థాయిని అందుకుంది. కొన్ని ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఇటీవ‌లే బోయ్ ఫ్రెండ్ ని పెళ్లాడి ల‌వ్ లైఫ్‌లోను తాప్సీ స‌క్సెసైంది. ఈ ఆనందాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటూనే ఉంది.