తాప్సీ లవ్ స్టోరీకి అంత చరిత్ర ఉందా!
తాప్సీ-బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 Jan 2024 5:30 PM GMTతాప్సీ-బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో తో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూ ఇయర్ వేడుకల్ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక మీడియాలో ఈ జంట హైలైట్ అయిం ది కూడా చాలా తక్కువ సందర్బాల్లోనే. సాధారణంగా బాలీవుడ్ భామలు ప్రియుడితో ఏ రేంజ్ లో కనిపి స్తుంటారో తెలిసిందే. కానీ తాప్సీ మాత్రం ఆ ఛాన్స్ తీసుకుంది చాలా తక్కువ సందర్భాల్లోనే. దీంతో తాప్సీ లవ్ స్టోరీ నెట్టింట అంతటి హాట్ టాపిక్ గా ఏ నాడు కనిపించలేదు.
కానీ తాప్సీ- మథియాస్ లవ్ స్టోరీకి చాలా చరిత్ర ఉందని తాజాగా తాప్సీ మాటల్ని బట్టి తెలుస్తోంది. ఇద్దరి ప్రేమకు దశాబ్ధానికి పైగా చరిత్ర ఉందని తెలుస్తోంది. అవును ఈ విషయాన్ని తాప్సీ స్వయంగా రివీల్ చేసింది. మథియాస్ తో రిలేషన్ షిప్ ఈనాటిది కాదని..పదేళ్ల నుంచి ఇద్దరు లవ్ లో ఉన్నట్లు తెలిపింది. హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన సమయంలో మథియాస్ బో తో పరిచయం మొదలైందని ఓ ఇంట ర్వ్యూలో రివీల్ చేసింది.
సెలబ్రిటీ అయిన తర్వాత డేటింగ్ చేయడం కష్టంగా ఉంటుందా? అని తాప్సీని అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. `నేను హిందీలో 13 ఏళ్ల క్రితమే నటించడం ప్రారంభించాను. అదే ఏడాది మథియాస్ ని కలిసాను. అప్పటి నుండి అదే వ్యక్తితో ఉన్నాను. ఆ రిలేషన్ షిప్ ని కొనసాగించాల నుకుంటున్నాను. అతను తప్ప మరోకరితో ఉండాలనే ఆలోచన నాకెప్పుడు కలగలేదు. ఎందుకంటే అతని రిలేషన్ షిప్ లో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.
మళ్లీ అలాంటి సంతోషం దొరకదని భావిస్తున్నాను. ఒకర్ని ఒకరు ఎంతో అర్దం చేసుకున్నాను. మా బంధం బలపడటానికి ఈ సమయం ఎంతో ఉపయోగ పడింది. అయితే నటిగా మారిన తర్వాత ఇలాంటి వాటి విష యంలో మంచి వ్యక్తుల్ని కనిపెట్టడం కష్టమవుతుంది. ఎందుకంటే వారు మనల్ని ఎందుకు ప్రేమిస్తు న్నారు? అనే ఓ కన్ ప్యూజన్ మొదలవుతుంది. ఆ ప్రేమలో నిజాయితీని కనిపెట్టడం కష్టమవుతుంది. నేను మాత్రమే కాదు నటీమణులు అంతా ఎదుర్కోంటున్న ప్రధానమైన సమస్య ఇది. సహ నటులు ఎప్పటికప్పుడు దీని గురించి చర్చించకోవడం నేను విన్నాను` అంది. తాప్సీ 2013లో ఛష్మీ బద్దూర్ తో బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.