Begin typing your search above and press return to search.

చీర కట్టు, ముక్కు పుడకతో ముద్దుగుమ్మ అదుర్స్‌

మంచు మనోజ్‌ తో కలిసి ఝుమ్మంది నాదం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి.

By:  Tupaki Desk   |   25 Jun 2024 8:59 AM GMT
చీర కట్టు, ముక్కు పుడకతో ముద్దుగుమ్మ అదుర్స్‌
X

మంచు మనోజ్‌ తో కలిసి ఝుమ్మంది నాదం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి. టాలీవుడ్‌ లో కెరీర్‌ ఆరంభించిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.


బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, బాద్‌ షా షారుఖ్ ఖాన్ తో కలిసి ఈ అమ్మడు చేసిన సినిమా డుంకీ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కమర్షియల్‌ గా ఈ అమ్మడు మరింత బిజీగా సినిమాలు చేయబోతుంది. ఇంతకు ముందు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేసిన ఈ అమ్మడు ఇప్పుడు అన్ని సినిమాలు చేస్తుంది.


సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన చీర కట్టు ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా చీర కట్టు లో నడుము నాభి అందం చూపిస్తే వైరల్‌ అవుతాయి.

ఈ ఫోటోల్లో పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా కూడా భలే ఉందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముక్కు పుడక పెట్టుకుని, చీర కట్టుకుని ఈ అమ్మడు కెమెరా కి ఇచ్చిన ఫోజ్ లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తెలుగు లో మళ్లీ ఈ అమ్మడు స్టార్‌ హీరోలకు జోడీగా నటించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

ఇంతటి అందగత్తెకు టాలీవుడ్‌ లో దక్కాల్సిన గుర్తింపు, అవకాశాలు దక్కలేదు. కానీ బాలీవుడ్‌ లో మాత్రం ఈ అమ్మడికి మంచి ఆఫర్లు దక్కాయి అనేది ఆమె ఫ్యాన్స్ మాట. అందుకే టాలీవుడ్‌ లో మళ్లీ అమ్మడు బిజీ అవ్వాలని వారు ఆశ పడుతున్నారు.