Begin typing your search above and press return to search.

స్కూల్ డేస్ లోనే తాప్సి ప్రేమ బాధలు

ఇదిలా ఉంటే డంకీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాప్సి తన లైఫ్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలని షేర్ చేసుకుంది.

By:  Tupaki Desk   |   22 Dec 2023 6:06 AM
స్కూల్ డేస్ లోనే తాప్సి ప్రేమ బాధలు
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకొని తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా వరుస మూవీస్ తో సత్తా చాటిన ముద్దుగుమ్మ తాప్సి పొన్ను. ఈ పంజాబీ ముద్దుగుమ్మ తెలుగులో ఝుమ్మంది నాదం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత గ్లామర్ క్వీన్ గా స్టార్ హీరోలతో జత కట్టింది. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ తెచ్చుకున్న నటిగా తనని ప్రూవ్ చేసుకునే మూవీస్ పెద్దగా పడలేదు.

బాలీవుడ్ లో బేబీ సినిమాతో ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సక్సెస్ తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అదే సమయం కంగనా రనౌత్ వివాదాలలో ఇరుక్కొని చాలా మందితో కయ్యం పెట్టుకుంది. ఈ సమయంలో కంగనాతో చేద్దామని అనుకున్న లేడీ ఒరియాంటెడ్ సినిమాలు అన్ని తాప్సి చేతికి వచ్చాయి. ఈ సినిమాలు సక్సెస్ కావడంతో ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు నటిగా తన టాలెంట్ ని షోఅప్ చేసుకునే కథలు చేసుకుంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు డంకీ మూవీతో ఏకంగా షారుఖ్ ఖాన్ కి జోడీగా నటించడం ద్వారా బాలీవుడ్ లో తనకంటూ ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో తాప్సి పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి.

ఇదిలా ఉంటే డంకీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాప్సి తన లైఫ్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలని షేర్ చేసుకుంది. తాను స్కూల్ డేస్ లో తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే తనకంటే సీనియర్ ని ప్రేమించానని చెప్పుకొచ్చింది. ప్రారంభంలో అతను కూడా నాపై ఇష్టం చూపించేవాడు. తరువాత చదువు డిస్టర్బ్ అవుతుందని దూరం పెట్టాడు.

అంతటితో ఆగకుండా భాగా చావుకోమని నాకు ఉచిత సలహా కూడా ఇచ్చాడు. అలా ఫస్ట్ లవ్ లో ఫెయిల్ అయ్యాక ఆ బాధ నుంచి బయటకి రావడానికి చాలా సమయం పట్టిందని తాప్సి ఇంటర్వ్యూలో చెప్పింది. తాప్సి చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.