వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీతో కోట్లు సంపాదిస్తున్న నటి
తాప్సీ ఈ కంపెనీ వ్యవస్థాపకురాలిగా తెలివైన వ్యాపారి అని నిరూపించుకుంది. ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ తో కోట్లలో ఆర్జిస్తోందనేది తాజా సమాచారం.
By: Tupaki Desk | 17 May 2024 5:30 PM GMTతాప్సీ పన్ను తన సోదరి షాగున్ పన్నూతో కలిసి వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ 'ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ'ని కొన్నేళ్ల క్రితమే ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాప్సీ ఈ కంపెనీ వ్యవస్థాపకురాలిగా తెలివైన వ్యాపారి అని నిరూపించుకుంది. ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ తో కోట్లలో ఆర్జిస్తోందనేది తాజా సమాచారం.
అంతేకాదు.. ప్రియుడు మాథియాస్ బోతో తాప్సీ పెళ్లికి ప్లానింగ్ చేసింది కూడా ఈ కంపెనీయే అని తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఈ అందమైన జంట రహస్య పెళ్లి ఇటీవల అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది సెలబ్రిటీలు సాధించలేకపోయిన దాన్ని తాప్సీ తన పెళ్లితో సాధించింది. డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో వివాహాన్ని ఇంత వైవిధ్యంగా ప్లాన్ చేయడానికి కారణమేమిటో తాప్సీ ఇటీవల రివీల్ చేసింది. చాలా సెలబ్రిటీ వివాహాల మాదిరిగా కాకుండా తాప్సీ తన పెళ్లి వేడుకలను రహస్యంగా ఉంచాలని అనుకుంది. తాను తన భర్త మాథియాస్ అట్టహాసమైన పెళ్లిళ్లకు వ్యతిరేకమని కూడా వెల్లడించింది. స్వదేశంలోనే ఈ పెళ్లి జరిగింది. మెహందీ వేడుక నుండి పెళ్లి రోజు వరకు మొత్తం ఈవెంట్‌ను తాప్సీ-షాగున్ కి చెందిన 'ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ' సంస్థ నిర్వహించింది.
తన భర్త విదేశీ మూలాలు ఉన్నవాడు అయినా కానీ స్వదేశంలో వివాహం చేసుకోవాలనే తాప్సీ నిర్ణయం ఆమె గొప్పతనం సింప్లిసిటీని తెలియజేస్తోంది. తాప్సీ స్వదేశీ సంప్రదాయానికి ఎంతగా ప్రాధాన్యతను ఇస్తుందో కూడా ఇది నిరూపిస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎక్కువగా జరిగే పరిశ్రమలో ఈ పెళ్లి ప్రత్యేకంగా నిలిచినందున దీనిని చాలా మంది ప్రశంసించారు.
నిజానికి ప్రచారం లేకుండానే తాప్సీ ఆకస్మిక వివాహం అభిమానులకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ తాప్సీ తెలివైన ప్రణాళికను మెచ్చుకునేందుకు ఎవరూ వెనకాడలేదు. తాప్సీ నటనా నైపుణ్యం, గట్ ఫీలింగ్ ని అభిమానులు ఆరాధించారు. తన వివాహాన్ని ప్రైవేట్‌గా ఉంచడం ద్వారా.. దానిని ప్లాన్ చేయడానికి తన సొంత సంస్థను ఉపయోగించడం ద్వారా తాప్సీ బాలీవుడ్‌లో ప్రముఖుల వివాహాలకు సరికొత్త స్ఫూర్తిగా మారింది. తాప్సీకి చెందిన ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ సంస్థ సంవత్సరానికి కోట్లలో టర్నోవర్ కలిగి ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. వెడ్డింగ్ ప్లానర్ అనేది లాభదాయకమైన వ్యాపారం అని విశ్లేషించిన తాప్సీ చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టడంపైనా ప్రశంసలు కురుస్తున్నాయి.