Begin typing your search above and press return to search.

హిట్ తో తాప్సీ స్టార్ లీగ్ పై క‌న్ను!

తాప్సీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కెళ్లి చాలా కాల‌మ‌వుతోంది. వ‌రుస‌గా హిందీ సినిమాలు చేస్తుంది. కానీ అమ్మ‌డిని ఓ రేంజ్ లో ప్రొజెక్ట్ చేసిన చిత్రం ఒక్క‌టీ లేదు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 9:14 AM GMT
హిట్ తో తాప్సీ స్టార్ లీగ్ పై క‌న్ను!
X

తాప్సీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కెళ్లి చాలా కాల‌మ‌వుతోంది. వ‌రుస‌గా హిందీ సినిమాలు చేస్తుంది. కానీ అమ్మ‌డిని ఓ రేంజ్ లో ప్రొజెక్ట్ చేసిన చిత్రం ఒక్క‌టీ లేదు. చేసిన సినిమాల్లో స‌క్సెస్..ఫెయిల్యూర్ ప‌ర్సంటేజీ తీస్తే వైఫ‌ల్యాలే శాత‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. 2020లో` తప్పడ్` త‌ర్వ‌తా మ‌రో విజ‌యం ఖాతాలో ప‌డ‌లేదు. గ‌తేడాది రిలీజ్ అయిన నాలుగైదు సినిమాలు కూడా వైఫ‌ల్యాలే మూట‌గ‌ట్టుకున్నాయి.

లూప్ లా పేట‌..శభాష్ మితు.. దోబారా.. తడ్కా అన్నీ డిజాస్టర్లే. పెర్పార్మెన్స్ ప‌రంగా పేరు పెట్ట‌డానికి లేదు కానీ..వైఫ‌ల్యాలు ఆ క్రెడిబిలిటినీ కూడా కిల్ చేస్తున్నాయి. నిర్మాత గా `ధ‌క్ ధ‌క్` తో ప్రేక్ష‌కుల ముందుకొ చ్చినా అక్క‌డా నిరాశ త‌ప్ప‌లేదు. టాలీవుడ్ లో ఎలాంటి ఫేజ్ ని అయితే ఫేస్ చేసిందో? అక్క‌డా అదే స‌న్నివేశం క‌నిపిస్తుంది. మ‌రి వీట‌న్నింటిని నుంచి డంకీ మాత్ర‌మే బ‌య‌టకు తీసుకురావాలి.

ఇందులో అమ్మ‌డు షారుక్ ఖాన్ కి జోడీగా న‌టిస్తోంది. సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. పై గా షారుక్ వ‌రుస విజ‌యాల‌తో పుల్ స్వింగ్ లో ఉన్నాడు. డంకీతో బాక్సాఫీస్ వ‌ద్ద హ్యాట్రిక్ న‌మోదు చేయాల‌ని భావిస్తున్నాడు. అన్నింటిని మించి రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డే స‌రికి అంచ‌నాలు రెట్టింపు అవుతున్నాయి. ఇందులో తాప్సీ పాత్ర‌ని తీసేయ‌డానికి లేదు

ఎందుకంటే హిరాణీ సినిమాల్లో హీరోయిన్ అంటే హీరోకి ధీటుగా హీరోయిన్ రోల్ డిజైన్ చేయ‌బ‌డి ఉంటుంది. ఇలా ర‌క‌ర‌కాల అంచ‌నాలు డంకీపై అంచ‌నాలు ఆకాశ‌న్నంటేలా చేస్తున్నాయి. ఈ సినిమాతో పాటు పాన్ ఇండియాలో స‌లార్ కూడా రిలీజ్ అవుతుంది. రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ ఖాయం. మ‌రి `డంకీ` తాప్సీ హిట్ రేస్ లోకి వ‌స్తుందా? లేదా? అన్న‌ది చూడా లి. షారుక్ కంటే విజ‌యం తాప్సీకి అత్యంత కీల‌క‌మైన‌దిగానే చెప్పాలి. సినిమా హిట్ అయితే గ‌నుక అమ్మ‌డు బాలీవుడ్ స్టార్ లీగ్ లో చేరిపోతుంది.