Begin typing your search above and press return to search.

తడిసిన చీరలో తాప్సి గ్లామర్ షాక్

కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా పింక్ లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.

By:  Tupaki Desk   |   4 Oct 2023 7:49 AM GMT
తడిసిన చీరలో తాప్సి గ్లామర్ షాక్
X

బ్యూటిఫుల్ హీరోయిన్ గా చాలా కాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో కొనసాగిన తాప్సీ పన్ను స్టార్ హీరోయిన్గా మాత్రం అంతకుమించి ఛాన్సులు అందుకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే ఆమె బాలీవుడ్ కి వెళ్ళిపోయిందో అక్కడ మాత్రం చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా పింక్ లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.


సినిమాకు అవసరమైతే బికినీలో కూడా దర్శనమిచ్చి మోక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను కూడా అందించింది. ఇక బాలీవుడ్ లో అలా కొనసాగుతూ వెళుతున్న తాప్సి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ తో హీటెక్కిస్తోంది. రీసెంట్గా మరోసారి అమ్మడు తడిసిన పరువాలతో మంత్రముగ్ధులను చేసింది. స్విమ్మింగ్ పూల్ లో చీరలో చీర కొంగును తడిపేసిన అమ్మడు అందులోనే నడుము అందాలను కూడా మరింత అందంగా ప్రజెంట్ చేసింది.

ఇక తన మత్తెక్కించే లుక్స్ తో కూడా ఈ భామ ఫాలోవర్స్ కు మతిపోయేలా చేసింది. గతంలో ఇంతకంటే ఘాటైన లుక్స్ లో కూడా కనిపించిన తాప్సి ఇప్పుడు మాత్రం అంతకుమించి అనేలా అందంగా ఉంది అంటూ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది. సినిమాల అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా ఈ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తూనే ఉంది.

ఇక తెలుగులో తాప్సి సినిమా అవకాశాలు అందుకుని చాలా కాలమే అయింది. తెలుగులో కావాలని చేయడం లేదా అనే కామెంట్స్ కూడా ఆమె చాలా సున్నితంగా సమాధానాలు ఇచ్చింది. ఇక్కడ నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని మంచి కంటెంట్ ఉన్న కధలు వస్తే చేయడానికి ఎప్పుడు సిద్ధమే అని వివరణ ఇచ్చింది.

ఇక తాప్సి బాలీవుడ్ లో తక్కువ బడ్జెట్ సినిమాలలో కూడా రెమ్యునరేషన్ తక్కువగా తీసుకుని మరి నటిస్తోంది. వీలైనంతవరకు నటిగా తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ గత కొంతకాలంగా మాత్రం అమ్మడికి సరైన విజయాలు బాలీవుడ్ లో కూడా దక్కడం లేదు. ప్రస్తుతమైతే చేతిలో డంకీ సినిమా ఉంది. రాజ్ కుమార్ హీరోని షారుక్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో అమ్మడు ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.