Begin typing your search above and press return to search.

దేవర చూసి హాలీవుడ్ ఆడియన్స్ షాక్! ఇదిగో ప్రూఫ్!!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర పార్ట్-1.. రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Sep 2024 4:06 PM GMT
దేవర చూసి హాలీవుడ్ ఆడియన్స్ షాక్! ఇదిగో ప్రూఫ్!!
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర పార్ట్-1.. రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించారు. రిలీజ్ కు ముందు భారీ అంచనాలు నెలకొల్పిన మూవీ.. వాటిని అందుకోలేకపోయినా ఫ్యాన్స్ ను మాత్రం మెప్పిస్తుంది. కొరటాల మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేదని కొందరు రివ్యూస్ ఇస్తున్నారు.

వాటితో సంబంధం లేకుండా.. దేవర భారీ ఓపెనింగ్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల వసూళ్లను రాబట్టింది. వీకెండ్ కావడంతో శనివారం.. మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దేవర మూవీ.. రిలీజ్ కు ముందు భారీగా రికార్డులు క్రియేట్ చేసింది. ఏ తెలుగు సినిమాకు దక్కనన్ని ఘనతలు.. దేవరకు దక్కాయనే చెప్పాలి. ఓవర్సీస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకుని.. అనేక రికార్డులు సృష్టించింది తారక్ మూవీ.

వరల్డ్ ఫేమస్ సినిమా ఈవెంట్ బియాండ్ ఫెస్ట్ లో స్ట్రీమింగ్ అయ్యి.. దేవర మూవీ అరుదైన ఘనత సాధించింది. లాస్ ఏంజెల్స్ సిటీలోని ఈజిప్టియన్ థియేటర్‌ లో సెప్టెంబర్ 26వ తేదీ సాయంత్రం దేవర ప్రీమియర్ ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తారక్ కూడా అక్కడే ఉన్నారు. అంతకుముందు రోజే అమెరికా చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్.. బియాండ్ ఫెస్ట్ లో హాలీవుడ్ ఆడియన్స్ తో కలిసి కూర్చొని దేవర మూవీని చూశారు.

అందుకు సంబంధించిన దృశ్యాలు.. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా దేవర టీమ్ స్పెషల్ వీడియో షేర్ చేసింది. సినిమా చూస్తున్నంత సేపు హాలీవుడ్ ఆడియన్స్ రియాక్షన్స్ ను క్యాప్చర్ చేసి.. వీడియో రూపంలో రిలీజ్ చేసింది. సినిమాలో అనేక యాక్షన్ సీన్స్, సాంగ్స్ ను చూసి వారంతా అంతా ఫిదా అయిపోయినట్లు క్లియర్ గా తెలుస్తుంది. చప్పట్లతో థియేటర్ లో మోత మోగించినట్లు అర్థమవుతుంది. సినిమా వారికి ఆకట్టుకున్నట్లు కనిపిస్తుంది.

అయితే మూవీ ప్రీమియర్ అయిన తర్వాత.. జపాన్ కు చెందిన ఓ ఫ్యాన్ తో తారక్ మాట్లాడిన విజువల్స్ ను మేకర్స్ వీడియోలో యాడ్ చేశారు. తాను జపాన్ వస్తానని ఆమెకు ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. కాగా, టోక్యో నుంచి తారక్ ను చూసేందుకు లాస్ ఏంజెల్స్ కు ఆమె వచ్చింది. బిగ్ జర్నీ చేసి అనుకున్నది సాధించింది. తన ఫేవరెట్ హీరోతో మాట్లాడి ఫుల్ గా సంబరపడిపోయింది. మరి దేవర మూవీ టీమ్ పోస్ట్ చేసిన వీడియోను మీరు కూడా చూసేయండి.