Begin typing your search above and press return to search.

దేవర కలెక్షన్స్.. 6వ రోజు కూడా కుమ్మేసింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా అద్భుతమైన ఆదరణతో థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది

By:  Tupaki Desk   |   3 Oct 2024 6:42 AM GMT
దేవర కలెక్షన్స్.. 6వ రోజు కూడా కుమ్మేసింది
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా అద్భుతమైన ఆదరణతో థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. వీకెండ్ తర్వాత కూడా ఈ మూవీ కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రికార్డ్ కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు పాత్రలలో నటించిన ఎన్టీఆర్ కథని తన భుజాలపై వేసుకొని నడిపించాడని ఆడియన్స్ అంటున్నారు. ఎన్టీఆర్ నుంచి సోలో మూవీ వచ్చి ఆరేళ్ళు అయిపోవడంతో ఆడియన్స్ కూడా ఆకలితో ఉన్నట్లు అనిపిస్తోంది.

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎన్టీఆర్ కి మంచి ఇమేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ఎన్టీఆర్ ని వారి ఇంట్లో వాడిగా అనుకుంటారు. అందుకే కుటుంబంతో ఎన్టీఆర్ సినిమాలు కలిసి చూసేందుకు ఇష్టపడతారు. ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు దొరకడంతో మరల 6వ రోజు ‘దేవర’ కలెక్షన్స్ గణనీయంగా పెరిగాయి.

తెలుగు రాష్ట్రాలలో 4, 5 వ రోజులలో 5+ కోట్ల షేర్ కలెక్షన్స్ ఈ మూవీ అందుకుంటే 6వ రోజు ఏకంగా 8.39 కోట్ల షేర్ రావడం విశేషం. దీనిని బట్టి సినిమాకి ఏ రేంజ్ లో ఆదరణ లభించిందో అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రా, నైజాం, సీడెడ్ లలో ఎక్కడా కూడా సినిమాకి ప్రేక్షకాదరణ తగ్గడం లేదు. 6వ రోజు ఏరియాల వారీ వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే ఇది స్పష్టంగా తెలుస్తోంది. నైజాంలో 6వ రోజు దేవరకి 3.71 కోట్ల షేర్ వచ్చింది.

సీడెడ్ లో 1.63 కోట్ల షేర్ రావడం విశేషం. ఇక వైజాగ్ లో 98 లక్షలు, తూర్పు గోదావరిలో 42 లక్షలు, పశ్చిక గోదావరిలో 33 లక్షల షేర్ వచ్చింది. కృష్ణా జిల్లాలో 49 లక్షలు, గుంటూరులో 46 లక్షలు, నెల్లూరులో 37 లక్షల షేర్ ఈ సినిమా వసూళ్లు చేసింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే 107.03 కోట్ల షేర్ ఉంది. ఆల్ మోస్ట్ మూడు ఏరియాలలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దగ్గరకి కలెక్షన్స్ వచ్చేసాయి. దసరా ఫెస్టివల్ హాలిడేస్ కూడా కలిసిరాకున్న నేపథ్యంలో మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

6వ రోజు దేవర కలెక్షన్స్

నైజాం - 3.71 కోట్లు

సీడెడ్ - 1.63 కోట్లు

వైజాగ్ - 0.98 కోట్లు

తూర్పు గోదావరి - 0.42 కోట్లు

పశ్చిమ గోదావరి - 0.33 కోట్లు

కృష్ణా - 0.49 కోట్లు

గుంటూరు - 0.46 కోట్లు

నెల్లూరు - 0.37 కోట్లు

కలెక్షన్స్ మొత్తం - 8.39 కోట్లు

మొత్తం 6 రోజుల కలెక్షన్ లెక్కలు చూసుకుంటే ఇలా ఉన్నాయి

నైజాం - 41.46 కోట్లు

సీడెడ్ - 22.26 కోట్లు

వైజాగ్ - 11.19 కోట్లు

తూర్పు గోదావరి - 6.88 కోట్లు

పశ్చిమ గోదావరి - 5.48 కోట్లు

కృష్ణా - 6.28 కోట్లు

గుంటూరు - 9.19 కోట్లు

నెల్లూరు - 4.29 కోట్లు

మొత్తం 6 రోజుల దేవర కలెక్షన్ - 107.03 కోట్లు