Begin typing your search above and press return to search.

'దేవర 2' నిజంగా ఉంటుందా?

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ డ్రామా ''దేవర''.

By:  Tupaki Desk   |   24 Dec 2024 2:45 AM GMT
దేవర 2 నిజంగా ఉంటుందా?
X

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ డ్రామా ''దేవర''. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్.. ఎన్నో అంచనాలు నడుమ సెప్టెంబర్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటకీ, దానితో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భారీగానే వసూళ్లు రాబట్టింది. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ ఈ చిత్రాన్ని ముగించిన సంగతి తెలిసిందే. తాజాగా 'దేవర 2' కు సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

కొరటాల శివ 'దేవర' పార్ట్-2 స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు తన టీమ్ తో గత కొన్ని రోజులుగా వర్క్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, షూటింగ్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అని ఓ వర్గం ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. అసలు 'దేవర 2' నిజంగా ఉంటుందా? అని కామెంట్లు చేస్తున్నారు.

'దేవర 1' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ₹500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందనప్పటికీ, అభిమానులు మాత్రం హ్యాపీగా లేరు. ఎందుకంటే కేవలం ఎన్టీఆర్ స్టార్‌డమ్‌ మాత్రమే ఈ చిత్రాన్ని నిలబెట్టిందని, అనిరుధ్ మ్యూజిక్ కాపాడిందనే అభిప్రాయంలో ఉన్నారు. ఫ్యాన్స్ కూడా గట్టిగా నిలబడి ఈ మూవీని గట్టెక్కించారనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఓటీటీలోకి వచ్చిన తర్వాత యాంటీ ఫ్యాన్స్ సీన్ టూ సీన్ షేర్ చేసి ఈ సినిమాని తెగ ట్రోల్ చేశారు. కొరటాల శివ రైటింగ్, సినిమాటోగ్రఫీపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అందుకే 'దేవర 2' ఉంటుందా లేదా? అనే చర్చలు జరుగుతున్నాయి.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే విధంగా, తన తండ్రి దేవరని అమితంగా ప్రేమించే కొడుకు వర ఎందుకు చంపాడు? అనే పాయింట్ తో 'దేవర 1' చిత్రాన్ని ఎండ్ చేశారు కొరటాల. అయితే అక్కడ 'బాహుబలి 2' చిత్రానికి వచ్చిన హైప్.. ఇక్కడ 'దేవర 2'కు రాలేదు. ఎన్టీఆర్ అభిమానులు సైతం సెకండ్ పార్ట్ పై పెద్దగా ఆసక్తి కనబరచకపోవడం గమనార్హం. అందుకే దేవర పార్ట్-2 చిత్రాన్ని విరమించుకునే అవకాశం ఉందంటూ కథనాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడేమో దర్శకుడు స్క్రిప్ట్ పనులు కూడా స్టార్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. మేకర్స్ త్వరలోనే ఈ సీక్వెల్ గురించి అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.

ఇకపోతే దేవర రిలీజ్ తర్వాత కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'దేవర 2'లో వర ఆడే ఆట చాలా కొత్తగా ఉంటుందని, వర వీర విహారం చూస్తారని చెప్పారు. ఇంకా చాలా పెద్ద కథ ఉంది. ఫస్ట్ పార్ట్ జస్ట్ బిగినింగ్ మాత్రమే. సెకండ్ పార్ట్ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. చాలా పాత్రలు వేరే షేప్ తీసుకుంటాయి. పాత్రల మధ్య డ్రామా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. దేవర, వర మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. దేవర కథలు వింటూ పెరిగిన వర.. అమితంగా ఇష్టపడే తన తండ్రి గుండెల్లోకి ఎందుకు కత్తి దింపాల్సి వచ్చింది?, అంత పెద్ద త్యాగం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? దేవర గురించి వర ఏం కథ రాసాడు? అసలు దేవరను ఏం చేసాడు? వంటి అంశాలు పార్ట్-2లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని కొరటాల తెలిపారు.

'దేవ‌ర‌' మూవీలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో నటించారు. జాన్వీ క‌పూర్‌ హీరోయిన్ గా నటించగా.. సైఫ్ అలీఖాన్‌ మెయిన్ విలన్ పాత్ర పోషించారు. శృతి మరాటే, ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, కలైరసన్, మురళీ శర్మ, అజ‌య్‌, గెట‌ప్ శీను, జరీనా వహాబ్, తాళ్లూరి రామేశ్వరి, మని చందన, నరైన్, సుదేవ్ నయ్యర్, తారక్ పొన్నప్ప, అభిమన్యు సింగ్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. అనిరుధ్ సంగీతం సమకూర్చగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె సంయుక్తంగా నిర్మించారు.