Begin typing your search above and press return to search.

హృతిక్ ని తార‌క్ ఛేజ్ చేసే సీన్!

ఛేజింగ్ స‌న్నివేశాల్లో హృతిక్ రోష‌న్ పెర్మార్మెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క్రిష్‌, ధూమ్, వార్ లాంటి సిరీస్ ల్లో ఛేజింగ్ సీన్స్ నెక్స్ట్ లెవ‌ల్ కి తీసుకెళ్లిన న‌టుడాయ‌న‌

By:  Tupaki Desk   |   21 Oct 2024 3:30 PM GMT
హృతిక్ ని తార‌క్ ఛేజ్ చేసే సీన్!
X

ఛేజింగ్ స‌న్నివేశాల్లో హృతిక్ రోష‌న్ పెర్మార్మెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క్రిష్‌, ధూమ్, వార్ లాంటి సిరీస్ ల్లో ఛేజింగ్ సీన్స్ నెక్స్ట్ లెవ‌ల్ కి తీసుకెళ్లిన న‌టుడాయ‌న‌. సాహ‌సోపేత‌మైన స‌న్నివేశాల విష‌యంలో ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌డు. రియ‌లిస్టిక్ పెర్పార్మెన్స్ తో అద‌ర‌గొడ‌తాడు. తాజాగా వార్-2లోనూ అలాంటి స‌న్నివేశాల‌కు ఏమాత్రం కొద‌వ‌లేదు. ఇంకా వార్-2 లో మ‌రింత అడ్వాన్స్ గా ఛేజింగ్ స‌న్నివేశాలు ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖ‌ర్జీ.

ఇప్ప‌టికే దుబాయ్ లో కొన్ని యాక్ష‌న్ ఛేజింగ్ స‌న్నివేశాలు ముగించాడు. తాజాగా త‌దుప‌రి షెడ్యూల్ ముంబైలో రెడీ అవుతుంది. ఇందులోనూ కీల‌క‌మైన ఛేజింగ్ స‌న్నివేశాలు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు త‌గ్గ సెట్లు నిర్మాణం జ‌రుగుతోంది. ఈ వారం నుంచి ఆ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా జాయిన్ అవుతున్నారు. ఈ షెడ్యూల్ లో తార‌క్-హృతిక్ పై ప్ర‌త్యేక‌మైన ఛేజింగ్ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు.

వాటితోనే షూట్ ప్రారంభం అవుతుంది. అయితే ఈసారి హృతిక్ ని ఛేజ్ చేసి ప‌ట్టుకోవాల్సిన బాధ్య‌త తార‌క్ పై ఉంది. తారక్ కూడా ఇలాంటి ఛేజింగ్ స‌న్నివేశాలు కొన్ని తెలుగు సినిమాల్లో చేసాడు. శ‌క్తి లాంటి భారీ స్పాన్ ఓ సినిమాలో తార‌క్ శక్తి మేర ప‌నిచేసాడు. కానీ మ‌రింత ఎన‌ర్జీతో వార్ -2 స‌న్నివేశాలు చేయాల్సి ఉంది. ఆ విష‌యంలో తార‌క్ ఎంత మాత్రం త‌గ్గ‌డు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ తార‌క్. అయితే బాలీవుడ్ ఛేజింగ్ స‌న్నివేశాలు అంటే బైక్, కార్ పై భారీ స్టంట్లు చేయాల్సి ఉంది.

ఇంత‌వ‌ర‌కూ తార‌క్ ఆ రేంజ్ స‌న్నివేశాల్లో న‌టించ‌లేదు. ఆ ర‌కంగా తార‌క్ ఇది కొత్త ఎక్స్ పీరియ‌న్స్. హృతిక్ తో ఛేజింగ్ సీన్స్ అంటే మ‌రింత సవాల్ గా ఉంటాయి. అందుకు తార‌క్ ఎంత‌గా రాటు దేలాడు? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే తార‌క్ షూటింగ్ కోసం ముంబైకి చేరుకున్నాడు. ఈ వారంలోనే షూట్ ప్రారంభం అవుతుంది. దీనిలో భాగంగా టీమ్ తో క‌లిసి ప‌ని చేస్తున్నాడు.