Begin typing your search above and press return to search.

కథ మారింది.. కటౌట్ మారింది..!

ఐతే ఒక హీరో మిస్ అయిన సినిమా మరొకరు చేయడం కామనే కానీ ఇద్దరు హీరోలు తమ కథలు మార్చుకున్నారు.

By:  Tupaki Desk   |   21 July 2024 3:00 AM GMT
కథ మారింది.. కటౌట్ మారింది..!
X

స్టార్ హీరో.. డైరెక్టర్.. మంచి స్టోరీ.. ఈ కాంబినేషన్ కుదిరితే తప్పకుండా ఒక బ్లాక్ బస్టర్ కొట్టినట్టే లెక్క. ఐతే కథ చర్చించేప్పుడు ఒక హీరో అనుకుని సెట్స్ మీదకు వెళ్లేది మరొకరితో అయితే మాత్రం ఆ సినిమా వచ్చాక అది హిట్ అయితే అర్రె ఒక సూపర్ హిట్ మిస్ అయ్యామని అనుకుంటారు. లేదా ఫ్లాప్ అయితే హమ్మయ్య వదిలేసి మంచి పనిచేశామనుకుంటారు. ఐతే ఒక హీరో మిస్ అయిన సినిమా మరొకరు చేయడం కామనే కానీ ఇద్దరు హీరోలు తమ కథలు మార్చుకున్నారు.

అలా కావాలని జరగకపోయినా తెలుగు స్టార్స్ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరు తాము చేయబోయే కథలు మార్చుకుని ఆడియన్స్ ని షాక్ ఇచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమా ముందు అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్నారు. అల్లు అర్జున్ తో ప్రీ లుక్ పోస్టర్ కూడా వదిలారు. కానీ ఎందుకో కొరటాల శివ ఆ ప్రాజెక్ట్ ని బన్నీ తో కాకుండా తారక్ తో తీస్తున్నాడు.

ఇదిలా ఉంటే త్రివిక్రం తో అల్లు అర్జున్ నెక్స్ట్ చేసే సినిమా గురించి నిన్నటి నుంచి ఒకటే హడావిడి జరుగుతుంది. భారీ బడ్జెట్ తో కాన్సెప్ట్ తో ఈ ప్రాజెక్ట్ రాబోతుందని అర్ధమవుతుంది. ఐతే ఈ కథను త్రివిక్రం ఎన్టీఆర్ తో అనుకున్నారు. మరి ఆయనతో ఎందుకు కుదరలేదు అన్నది తెలియదు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ తో ఆ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇలా తారక్, బన్నీ ఇద్దరు కథలు మార్చుకున్నారు. కథ మారే సరికి కటౌట్ కూడా మారిపోయింది. అల్లు అర్జున్ దేవరగా.. త్రివిక్రం తో చేసే భారీ సినిమా ఎన్.టి.ఆర్ చేయాల్సి ఉండగా వీరిద్దరికి ఆ సినిమాలు చేయడం కుదరక కథలు మార్చుకుని చేస్తున్నారు. మరి ఈ సినిమాల రిలీజ్ తర్వాత ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారన్నది చూడాలి. ఎన్టీఆర్ దేవర దాదాపు రిలీజ్ కు రెడీ అవుతుండగా త్రివిక్రం తో అల్లు అర్జున్ సినిమా ఇంకా మొదలు పెట్టలేదు. కొరటాల శివ ఎన్.టి.ఆర్ కాంబోలో వస్తున్న దేవర సినిమాను కూడా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో తారక్ అయితే సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది.