Begin typing your search above and press return to search.

రామోజీకి కడసారి నివాళులు.. తారక్ ఎందుకు రాలేదు?

చిరంజీవి కడసారి నివాళులు అర్పించేందుకు వెళ్లగా.. తారక్ మాత్రం హాజరు కాలేదు. అందుకు కారణం ఆయన కమిట్మెంట్లే అని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   9 Jun 2024 5:07 AM GMT
రామోజీకి కడసారి నివాళులు.. తారక్ ఎందుకు రాలేదు?
X

ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు మరణవార్త.. యావత్తు తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు పాత్రికేయ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శనివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచారు రామోజీ. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆ తర్వాత రామోజీ పార్థివదేహాన్ని ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ ఆఫీస్ కు తరలించారు.

ఇక రామోజీరావుకు కడసారి నివాళులు అర్పించేందుకు అనేక మంది ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి తరలివచ్చారు. చిరంజీవి, రాజేంద్రప్రసాద్, పవన్ కళ్యాణ్, రాజమౌళి, కీరవాణి, బోయపాటి శ్రీను, తేజ, నరేష్, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, రాఘవేంద్రరావు, బ్రహ్మానందం సహా అనేక మంది సినీ సెలబ్రెటీలు రామోజీకి పూలతో నివాళులు అర్పించారు. అంతకుముందు అనేక మంది సోషల్ మీడియాలో కూడా సంతాపం ప్రకటించారు.

అయితే రామోజీ రావు మరణ వార్త తెలిసిన వెంటనే ముందు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ నెట్టింట స్పందించారు. చిరంజీవి కడసారి నివాళులు అర్పించేందుకు వెళ్లగా.. తారక్ మాత్రం హాజరు కాలేదు. అందుకు కారణం ఆయన కమిట్మెంట్లే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గోవాలోని ఓ ప్రాంతంలో ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందుకు మేకర్స్ భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు.

దేవర కొత్త షెడ్యూల్ జూన్ 3వ తేదీ ప్రారంభం కాగా.. జూన్ 5వ తేదీన షూట్ లో జాయిన్ అయ్యారు తారక్. మళ్లీ హైదరాబాద్ వచ్చి వెళ్తే.. మొత్తం షెడ్యూల్ కు ఇబ్బంది అవుతుందని ఎన్టీఆర్ ఆలోచించారట. అందుకే రామోజీకి కడసారి నివాళులు అర్పించేందుకు రాలేదని సమాచారం. లేకుంటే తారక్.. ఇలాంటి సందర్భాన్ని అస్సలు మిస్ కారని చెబుతున్నారు. అందుకే కళ్యాణ్ రామ్ ఒక్కరే వెళ్లారని అంటున్నారు. సాధారణంగా.. ఇలాంటి సందర్భాల్లో తారక్, కళ్యాణ్ రామ్ కలిసే వెళ్తుంటారన్న విషయం తెలిసిందే.

అయితే సోషల్ మీడియాలో ఎన్టీఆర్.. నిన్ను చూడాలని సినిమా చేస్తున్న సమయంలో రామోజీరావుతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మీడియా సామ్రాజ్యాధినేత లేని లేటు తీర్చలేనిదని అన్నారు. రామోజీ మన మధ్య లేరన్న విషయం చాలా బాధాకరమని తెలిపారు. నిన్ను చూడాలని సినిమాతో తనను తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. కాగా, రామోజీ అంత్యక్రియలు ఆయన ఇప్పటికే నిర్మించుకున్న స్మృతి వనంలో జరగనున్నాయి.