Begin typing your search above and press return to search.

మంచు విష్ణు.. ఆ రూట్లో ఎన్టీఆర్ కంటే ఎక్కువ ఫాలోయింగ్!

టాలీవుడ్ లో టాప్ 5 స్టార్స్ పేర్లు తీసుకుంటే అందులో కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు.

By:  Tupaki Desk   |   12 July 2024 9:35 AM GMT
మంచు విష్ణు.. ఆ రూట్లో ఎన్టీఆర్ కంటే ఎక్కువ ఫాలోయింగ్!
X

టాలీవుడ్ లో టాప్ 5 స్టార్స్ పేర్లు తీసుకుంటే అందులో కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ ఇండియా లెవల్ కి రీచ్ అయ్యింది. అందులో బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఏరికోరి మరి వార్ 2 సినిమాలో ఒక లీడ్ కోసం ఎన్టీఆర్ ని తీసుకున్నారు. హృతిక్ రోషన్ తో సమానమైన క్యారెక్టర్ ని తారక్ కి ఇచ్చారు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ తారక్ తో చేయబోతున్నాడు.

సినిమాల పరంగా చూసుకుంటే టాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత టాప్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్స్ అంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు మాత్రమే వినిపిస్తాయి. ఆయన నెక్స్ట్ సినిమాల లైన్ అప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోంది. లార్జర్ దెన్ లైఫ్ లాంటి యూనివర్శల్ కథలకి తారక్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి కథలు తన దగ్గరకి వచ్చి నచ్చితే చేయడానికి ఒకే చెబుతున్నాడు. అయితే సోషల్ మీడియా పరంగా చూసుకుంటే తారక్ అంత యాక్టివ్ గా ఉండడు.

ఇక మరోవైపు సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పరంగా మంచు విష్ణు కంటే తారక్ వెనుకబడి ఉన్నాడని చెప్పొచ్చు. మంచు విష్ణుకి 8 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కి 7.5 మిలియన్ మాత్రమే ఉన్నారు. సోషల్ మీడియాలో మంచు విష్ణు గురించి ఏదో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. తారక్ గురించి మూవీ రిలీజ్ అయినపుడు తప్ప మిగిలిన సమయాలలో పెద్దగా బజ్ ఉండదు.

అలాగే మంచు విష్ణు ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ని షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటాడు. అయితే తారక్ మూవీస్ ప్రమోషన్స్ కోసం తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ఎక్కువగా వాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఫ్యామిలీ వెకేషన్ కి సంబందించిన ఫోటోలని షేర్ చేసుకుంటాడు. షూటింగ్ ల సమయంలో అయితే సోషల్ మీడియాలో తారక్ కంప్లీట్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు.

ఈ కారణంగా తారక్ కి ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తక్కువ ఉన్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మంచు విష్ణు కూడా ఇప్పుడు కన్నప్ప సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేస్తున్నాడు. యాక్షన్ అండ్ డివోషనల్ కలగలిసిన చిత్రంగా కన్నప్ప మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ కీలక పాత్రలలో నటించారు. దీంతో కన్నప్ప సినిమాపై హైప్ క్రియేట్ అయ్యి ఉంది.