Begin typing your search above and press return to search.

'వార్ 2'.. తారక్ కి ఫ్యాన్స్ ఇస్తున్న సలహా ఇది!

అగ్ర హీరోల కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్లు ఎంచుకుంటున్న కథలు, దర్శకులు తదితర అంశాలపై ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

By:  Tupaki Desk   |   21 Nov 2023 10:30 AM GMT
వార్ 2.. తారక్ కి ఫ్యాన్స్ ఇస్తున్న సలహా ఇది!
X

అగ్ర హీరోల కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్లు ఎంచుకుంటున్న కథలు, దర్శకులు తదితర అంశాలపై ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వాటిలో ఏమాత్రం తడబడినా అప్పుడు జరిగే డ్యామేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అలా ఇప్పటికే టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి 'ఆదిపురుష్' రూపంలో జరిగింది. నార్త్ నుంచి బడా ఫిలిం మేకర్స్ సినిమా చేసేందుకు రెడీ అవ్వడంతో వెనకా ముందు ఆలోచించకుండా ప్రభాస్ ఆదిపురుష్ కమిట్ అయ్యాడు.

అది కాస్త ప్రభాస్ తో పాటు ఫ్యాన్స్ ని కోలుకోకుండా చేసింది. ఇప్పుడు అలాంటి మిస్టేక్ ఎన్టీఆర్ విషయంలో జరగకూడదని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఇటీవల RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. సినిమాలో కొమరం భీమ్ గా తారక్ నటనకు యావత్ సినిమా ప్రపంచం ఫిదా అయిపోయింది. RRR తర్వాత తారక్ తో సినిమా చేసేందుకు హాలీవుడ్ మేకర్స్ సైతం ఇంట్రెస్ట్ చూపించారంటే తారక్ పై వాళ్లకి ఎంతలా నమ్మకం ఏర్పడిందో స్పష్టమవుతుంది.

ప్రస్తుతం 'దేవర' షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ 'వార్ 2' షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు. సుమారు మూడు నెలల పాటు తారక్ ఈ సినిమాకి కాల్ షీట్స్ కేటాయించాడట. 'వార్ 2' లో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కాగా ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుందని గతంలో వార్తలొచ్చినప్పుడు కచ్చితంగా ఆమె ఎన్టీఆర్ పక్కన నటిస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ భామ శార్వరి వాఘ్ 'వార్ 2' లో తారక్ తో జోడి కట్టే ఛాన్స్ కొట్టేసిందట. బాలీవుడ్ మూవీ 'బంటీ ఔర్ బబ్లీ' సీక్వెల్ లో హీరోయిన్గా నటించిన శార్వరి ఇప్పుడు 'వార్ 2'లో ఎన్టీఆర్ సరసన నటించనుంది సౌత్ లో ఈ ముద్దుగుమ్మకు ఇదే ఫస్ట్ మూవీ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన ఆమెకు చానల్స్ రావడం విశేషం.

కానీ ఫ్యాన్స్ మాత్రం మా హీరో పక్కన మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ నటిస్తే బాగుంటుందంటూ చెబుతున్నారు. అంతేకాకుండా నార్త్ లో ఇతర హీరోలకు జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మొదటినుంచి ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని తారక్ కి ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.