బాలీవుడ్ పై పట్టు కోసం తారక్ న్యూ స్ట్రాటజీ
తనకి సంబందించిన కమర్షియల్ యాడ్స్, బాలీవుడ్ సినిమా ఆఫర్స్ బాధ్యతలు అన్ని కూడా ఆ ఏజెన్సీ ఇకపై చూసుకోబోతోందని టాక్.
By: Tupaki Desk | 12 May 2024 4:51 AM GMTఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తారక్ బ్రాండ్ వేల్యూ కూడా పెరిగింది. దీంతో నార్త్ ఇండియన్ డైరెక్టర్స్, నిర్మాతలు కూడా ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నారు. ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది.
దేవర మూవీతో దేశ వ్యాప్తంగా తారక్ సోలోగా గ్రాండ్ సక్సెస్ అందుకుంటాడనే మాట వినిపిస్తోంది. దీంతో పాటుగా బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వార్ 2 చిత్రాన్ని తారక్ చేస్తున్నాడు. హృతిక్ రోషన్ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ సినిమా తెరకెక్కుతోంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ సినిమాని తారక్ చేయబోతున్నాడు.
యష్ రాజ్ ఫిలిమ్స్ లోనే తారక్ సోలోగా ఓ స్పై థ్రిల్లర్ మూవీ చేయనున్నాడంటూ ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. ఇదిలా ఉంటే తారక్ కి సంబందించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఒక ఏజెన్సీని తన ప్రచారం కోసం ప్రత్యేకంగా నియమించుకున్నారంట.
తనకి సంబందించిన కమర్షియల్ యాడ్స్, బాలీవుడ్ సినిమా ఆఫర్స్ బాధ్యతలు అన్ని కూడా ఆ ఏజెన్సీ ఇకపై చూసుకోబోతోందని టాక్. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పట్టు సాదించాలనే కసితో ఉన్న తారక్ వ్యూహాత్మకంగా ఏజెన్సీని పెట్టుకోవడం జరిగిందంట. బాలీవుడ్ లో చాలా మంది దర్శక, నిర్మాతలు సినిమాల కోసం తారక్ ని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పక్కా ప్లానింగ్ తో సరైన కథలని ఎంపిక చేసుకొని తనకంటూ యూనిక్ బ్రాండ్ క్రియేట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ ఏజెన్సీ తారక్ కి సంబందించి మూవీ ప్రమోషన్స్ తో పాటు బాలీవుడ్ సినిమాల బాధ్యత చూసుకుంటుందని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం తారక్ చేతిలో ఉన్న ఈ మూడు సినిమాలు హిట్ అయితే ఇమేజ్ పరంగా తారక్ టాప్ లో ఉంటాడు. అప్పుడు మరింత కేర్ ఫుల్ గా కథలని ఎంపిక చేసుకొని మూవీస్ చేయాల్సి ఉంటుంది. దానికోసమే ఈ కసరత్తు అంతా చేస్తున్నట్లు టాక్.