Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్.. నెక్స్ట్ ఏంటి?

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. సిల్వర్ స్క్రీన్ పై కనపడి చాలా నెలలు అయిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   6 July 2024 5:34 AM GMT
ఎన్టీఆర్.. నెక్స్ట్ ఏంటి?
X

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. సిల్వర్ స్క్రీన్ పై కనపడి చాలా నెలలు అయిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటి వరకు తారక్ కొత్త మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. అయితే ఈపాటికే కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పార్ట్ -1 రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల దసరాకు వాయిదా వేశారు. రీసెంట్ గా సెప్టెంబర్ 27వ తేదీకి ప్రీ పోన్ చేశారు.

అయితే ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్.. మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ మధ్య తారక్.. దేవర మూవీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంటుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా తెలిపారు. స్టొరీ ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత.. దేవర స్ర్కిప్ట్ వర్క్ కోసం ఎక్కువ టైమ్ కేటాయించారు తారక్. అన్ని సెట్ అయ్యాక సెట్స్ పైకి తీసుకొచ్చారు. అందుకే మూవీపై అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఇదంతా ఓకే కానీ.. తారక్ అప్ కమింగ్ మూవీస్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న దేవర మూవీకి సీక్వెల్ ఉన్న విషయం తెలిసిందే. అయితే దేవర రెండో భాగం.. ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. 2026లో మొదలు పెట్టనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతకన్నా ముందు ఎన్టీఆర్.. వార్ -2, NTR 31 ప్రాజెక్టులను పూర్తి చేయనున్నారు.

దేవర షూటింగ్ జరుగుతుండగా.. తారక్ వార్ -2 సినిమా షెడ్యూల్ లో కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గూఢచారి రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వార్ -2 సంగతి అలా ఉండగా.. NTR 31 ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ అవుతుందో ఇంకా తెలియదు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్-2, NTR 31 సినిమాలకు ఒకేసారి డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. వర్క్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. సలార్-2నే ముందు స్టార్ట్ చేస్తారని కూడా టాక్ వినిపించింది. అయితే ప్రశాంత్ నీల్.. సలార్ సీక్వెల్ తో బిజీ అయిపోతే తారక్.. దేవర-2 ను స్టార్ట్ చేస్తారని అంటున్నారు. మరి దేవర మూవీ రిలీజ్ అయ్యాక.. ఎన్టీఆర్ నెక్స్ట్ ఏ సినిమా కంప్లీట్ చేస్తారో వేచి చూడాలి.