ఇంట్రెస్టింగ్: తరణ్ ఆదర్శ్ సలార్‌కే ఓటేశాడు
సంవత్సరం ముగింపులో ప్రేక్షకులకు ఇది విందు భోజనంలా ఉంటుందని తరణ్ ఆదర్శ్ అన్నారు.
By: Tupaki Desk | 10 Oct 2023 3:00 AM GMTపరిశ్రమ సహా ట్రేడ్ వర్గాలు రెండు బడా చిత్రాల మధ్య ఘర్షణలను నివారించడానికి చిత్రనిర్మాతలను అభ్యర్థించడం సహజం. కానీ డిసెంబర్ 2023లో బాక్సాఫీస్ వద్ద వరుసగా క్రేజీ చిత్రాలు పోటీపడనుండడం సర్వత్రా చర్చకు తావిస్తోంది. డిసెంబర్ 1న రణబీర్ కపూర్ నటించిన యానిమల్ - విక్కీ కౌశల్ నటించిన బయోపిక్ సామ్ బహదూర్ విడుదల కానున్నాయి. డిసెంబర్ 8న సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన యోధా .. కత్రినా కైఫ్ నటించిన మెర్రీ క్రిస్మస్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిసెంబర్ 22న షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ - ప్రభాస్ నటించిన సలార్ మధ్య అంతిమ పోరును జనం చూడబోతున్నారు. దీంతో ఊహించిన విధంగానే ట్రేడ్ నిపుణులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ భారీ క్రేజ్ తో వస్తున్నవే గనుక వీటి రిలీజ్ ల మధ్య గ్యాప్ ఎక్కువ అవసరమని ట్రేడ్ భావిస్తోంది.
అసలు ఇన్ని సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? అన్నదానికి చాలామందిలో కన్ఫ్యూజన్ అలానే ఉంది. దానిపై ట్రేడ్ వెటరన్ తరణ్ ఆదర్శ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తనదైన శైలిలో విశ్లేషించారు. ''మీరు చాలా కష్టపడి సినిమాలు తీస్తారు. మీరు దానిపై డబ్బు పెట్టుబడి పెట్టారు. ఆపై దర్శకనిర్మాతలు ఇతర చిత్రాలతో పోటీ బరిలోకి దిగుతున్నారు. యానిమల్ బాగా ఆడుతుంటే, డిస్ట్రిబ్యూటర్ స్క్రీన్‌లు షోలను వదులుకుంటారని మీరు అనుకుంటున్నారా? డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ అవుతుందని, ఆ తర్వాత డుంకీ, సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో నేను వివరించగలను. మీ సినిమా ఎంత బాగున్నా డుంకీ లేదా సలార్ విషయంలో ఆలోచించాలి'' అని వ్యాఖ్యానించారు.
నిర్మాత కం ట్రేడ్ విశ్లేషకుడు గిరీష్ జోహార్ విశ్లేషిస్తూ.. ''ఇది ఖచ్చితంగా ఆపాల్సిన పరిస్థితి. అందరూ అతి విశ్వాసంతో ఉన్నారు. రిలీజ్ డేట్ విషయంలో సలార్ కచ్చితంగా పెద్ద నిరాశనే మిగిల్చింది. ఇది పెద్ద సినిమా.. వేరే తేదీకి రావాలి. నేను కంటెంట్ గురించి ఏమీ చెప్పడం లేదు. ప్రేక్షకులే ఆ నిర్ణయం తీసుకుంటారు. సలార్ బహుశా మరో రూ. 1000 కోట్ల వసూళ్లు సాధిస్తుంది. అయితే ఘర్షణ కారణంగా గరిష్ట సామర్థ్యాన్ని అందుకుంటుందా? అన్నది చూడాలి. అదే డుంకీకి కూడా వర్తిస్తుంది. ఫలితంగా నిర్మాతలకు, పరిశ్రమకు నష్టమే'' అని అన్నారు.
ప్రఖ్యాత అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ నిర్మాతలు ఎందుకు ఇలా పోటీకి మొగ్గుచూపుతున్నారో వివరిస్తూ ''నేను ఒక చిత్రనిర్మాతని ఎందుకు ఈ క్లాష్ అని అడిగాను. అతను నన్ను తిరిగి అడిగాడు? మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. మంచి సినిమా చేస్తే బాగుంటుంది! అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సినిమానే బెస్ట్ అని భావించడం నేను చాలా సంవత్సరాలుగా గమనించాను..ఈ గొడవ అభిమానుల యుద్ధాలకు దారి తీస్తుందని, షో షేరింగ్‌పై సమస్యలకు దారితీస్తుందని కూడా అన్నారు. డిసెంబరులో ప్రతికూలత ప్రారంభం కావడం లేదు. ఇది ఇప్పటికే ప్రారంభమైంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్‌ల కోసం పోరాడుతున్నారు. పెద్ద మల్టీప్లెక్స్‌లు షారుఖ్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీలను కట్టడి చేస్తాయి. కానీ సలార్‌కి KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. హార్డ్‌కోర్ యాక్షన్ ఉంది. ఈ చిత్రాన్ని ఎవరూ విస్మరించరు. ప్రభాస్ చివరి రెండు సినిమాలు ఆడలేదు. కానీ ప్రశాంత్ నీల్ - హోంబాలే సినిమాలు దాదాపు 100శాతం సక్సెస్ ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నాయి. కాబట్టి కిస్ ఫిల్మ్ కో కిత్నే అనే ప్రశ్న వస్తుంది? అని విశ్లేషించారు.
ట్రేడ్ అనలిస్ట్ అతుల్ మోహన్ హర్షం వ్యక్తం చేస్తూ, ''ఇది తప్పించుకోలేని పరిస్థితి. జనవరి మొదటి మూడు వారాల్లో విడుదల లేదు. ఈ పిచ్చి హడావిడికి కారణం నాకు కనిపించడం లేదు'' అని విశ్లేషించారు. మే 2023 సెలవు కాలంలో ఎటువంటి విడుదలలు లేవు. జూలై కూడా రెండో వారం, మూడో వారాల్లో విడుదలలు లేవు. మా పరిశ్రమ హాలీవుడ్ చిత్రాలకు సోలో విడుదలలను అనుమతించింది. ఔర్ అబ్ జగద్ రహే హై!'' అని కూడా అన్నారు. ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ యానిమల్- సామ్ బహదూర్ మధ్య పోటీ ఉన్నా.. అవి రెండూ చాలా భిన్నమైనవి. ఆ రెండిటి కలెక్షన్లలో ఎనిమిది రెట్లు తేడా ఉంటుంది! అని విశ్లేషించాడు. సామ్ బహదూర్ అర్బన ఉత్పత్తి అని కూడా అన్నారు.
యోధా వర్సెస్ మెర్రీ క్రిస్మస్ విషయానికొస్తే.. ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ, ''మెర్రీ క్రిస్మస్‌పై యోధా హవా సాగుతుంది. డుంకీ వర్సెస్ సలార్ క్లాష్ గురించి వ్యాఖ్యానిస్తూ.. కచ్చితంగా ఇది ఆపాల్సినది. ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంలా అనిపిస్తోంది. డుంకీ క్రిస్మస్ 2023 కోసం లాక్ అయింది. సలార్ అదే సమయంలో విడుదల తేదీని చాలా సార్లు మార్చారు. ఓ ప్రముఖ దర్శకుడు, ఓ స్టార్ చేసిన సినిమాకు వ్యతిరేకంగా ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇవి రెండూ ఈ ఏడాది 1000 కోట్ల సినిమాలు. దర్శకులు ఎప్పుడూ విఫలం కాలేదు... అని విశ్లేషించారు.
విశ్లేషకుడు రాజ్ భన్సల్ విశ్లేషిస్తూ.. షారుక్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న స్టార్. ఇక ప్రభాస్‌కు విదేశాల్లోని తమిళ, తెలుగు కమ్యూనిటీల్లో ఫాలోయింగ్ ఉంది. భారతదేశంలో దక్షిణాది మినహా SRK రాజు. అయితే సౌత్‌లో ప్రభాస్ చాలా బలంగా ఉన్నాడు. దక్షిణాదిలో సలార్ ఆధిపత్యం చెలాయిస్తుంది. అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాలలో డుంకీ ఆధిపత్యం చెలాయిస్తుంది.. అని అన్నారు. షారుఖ్ ఖాన్‌కు ఈ సంవత్సరం దేశప్రజల నుండి లభించిన ప్రేమతో అతడు ఖచ్చితంగా హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందుకోవడం ఖాయం. హిరాణీకి అపజయం లేదు.. అని కూడా విశ్లేషించారు. సంవత్సరం ముగింపులో ప్రేక్షకులకు ఇది విందు భోజనంలా ఉంటుందని తరణ్ ఆదర్శ్ అన్నారు.