Begin typing your search above and press return to search.

తరుణ్ భాస్కర్ సినిమా వడ్డింపులు ఎప్పుడు..?

పదేళ్ల కెరీర్ లో మూడంటే మూడు సినిమాలే తీసిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ 3 సినిమాలతోనే యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

By:  Tupaki Desk   |   6 March 2025 9:14 AM IST
తరుణ్ భాస్కర్ సినిమా వడ్డింపులు ఎప్పుడు..?
X

పదేళ్ల కెరీర్ లో మూడంటే మూడు సినిమాలే తీసిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ 3 సినిమాలతోనే యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. విజయ్ దేవరకొండతో పెళ్లిచూపులు సినిమా తో డైఎక్టర్ గా మారిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత రైటర్ గా కొన్ని సినిమాలు చేసిన అతను రెండేళ్ల క్రితం కీడా కోలా సినిమా చేశాడు. మధ్యలో యాక్టర్ గా బిజీ బిజీగా ఉన్నాడు తరుణ్ భాస్కర్.

ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సినిమాలు డైరెక్ట్ చేస్తే చూడాలని ఉందని ఆడియన్స్ కోరుతున్నారు. కీడా కోలా వచ్చి రెండేళ్లు అవుతున్నా తరుణ్ భాస్కర్ నెక్స్ట్ డైరెక్టోరియల్ మూవీ ఏదన్నది క్లారిటీ రాలేదు. ఈనగరానికి ఏమైంది సీక్వెల్ కథ సిద్ధమని అంటున్నా దాని గురించి బయటకు రాలేదు. తరుణ్ భాస్కర్ సినిమాల అప్డేట్ ఇవ్వట్లేదు కానీ మిగతా విషయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు.

లేటెస్ట్ గా ఈ డైరెక్టర్ తన గ్యాంగ్ కి మటన్ వండుతున్న వీడియో బయటకు వచ్చింది. తరుణ్ సినిమాల్లో నటించే జీవన్ సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేశాడు. కుక్కర్లో మటన్ వండుతున్న తరుణ్ ని చూపించాడు. అది చూసిన ఆడియన్స్ మటన్ కాదు మాకు మంచి సినిమా ఎప్పుడు అందిస్తావ్ అని కామెంట్స్ చేస్తున్నారు. తరుణ్ భాసకర్ సినిమా వడ్డింపులు ఎప్పుడు అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఐతే తరుణ్ సినిమా డైరెక్షన్ కన్నా యాక్టింగ్ చాలా ఈజీగా అవుతుందని భావిస్తున్నాడని తెలుస్తుంది. సినిమా చేసే టైం లేకుండా అతనికి మంచి ఛాన్స్ లు వస్తున్నాయి. లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో కూడా ఒక మంచి రోల్ చేస్తున్నాడు. ఇలా యాక్టర్ గా బిజీ అవడం వల్ల తన రైటింగ్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాడని తెలుస్తుంది.

తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు 2, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ చేస్తాడని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కానీ అతను మాత్రం యాక్టింగ్ తో బిజీ అయ్యాడు. కీడా కోలా సినిమా తో చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఆ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించాడు.