తరుణ్ భాస్కర్.. ఈ రిస్క్ అవసరమా?
డైరెక్టర్ గా రెండు, మూడేళ్ళకి ఒక సినిమా చేస్తోన్న తరుణ్ భాస్కర్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు హీరోగా ఓ మలయాళీ మూవీని రీమేక్ చేయబోతున్నారంట.
By: Tupaki Desk | 8 April 2024 4:01 AM GMTప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. భాషలకి పరిమితం లేకుండా సినిమాలు డిజిటల్ స్పేస్ లో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఓటీటీ ఛానల్స్ కూడా ఒక భాషలో హిట్ అయిన సినిమాని డబ్ చేసి ఇతర భాషలలో కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ కారణంగా అన్ని భాషా సినిమాలు, వెబ్ సిరీస్ లు అందరికి రీచ్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో వేరే భాష మూవీని రీమేక్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.
ఇప్పటికే భోళా శంకర్, గాడ్ ఫాదర్ రీమేక్ తో మెగాస్టార్ చేతులు కాల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా భీమ్లా నాయక్ మూవీ రీమేక్ చేసి ఫెయిల్యూర్ సొంతం చేసుకున్నారు. మిగిలిన హీరోలు కూడా రీమేక్ సినిమాలు చేసే ధైర్యం చేయడం లేదు. ఒకవేళ చేసే ఆలోచన ఉన్న అది తెలుగులో రాలేదని అనుకోని కంటెంట్ అద్భుతంగా ఉందనే అభిప్రాయానికి వస్తే మన నేటివిటీకి తగ్గట్లుగా మార్చి రీమేక్ చేస్తున్నారు.
పెళ్లి చూపులు సినిమాతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తరుణ్ భాస్కర్ కూడా ఇప్పుడు రీమేక్ కథలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. అతనికి యూత్ లో మంచి ఇమేజ్ ఉంది. ఈ నగరానికి ఏమైంది అనే మూవీతో కూడా హిట్ కొట్టాడు. చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని కీడాకోలా అంటూ ఓ మూవీ చేసి నిరాశపరిచాడు. ఈ సినిమాలో లీడ్ రోల్ తరుణ్ భాస్కర్ చేయడం విశేషం.
డైరెక్టర్ గా రెండు, మూడేళ్ళకి ఒక సినిమా చేస్తోన్న తరుణ్ భాస్కర్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు హీరోగా ఓ మలయాళీ మూవీని రీమేక్ చేయబోతున్నారంట. మలయాళంలో జయ జయ జయహే అని ఓ చిన్న సినిమా వచ్చింది. ఈ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
దీంతో తెలుగు ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని చాలా వరకు చూసేసారు. ఓటీటీలో తెలుగు వెర్షన్ కి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో తరుణ్ భాస్కర్ హీరోగా రీమేక్ చేయబోతున్నారనే టాక్ బయటకొచ్చింది. ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్ని తెలిసి తెలుగులో కూడా తెలుగులో డబ్ అయిన మూవీని మళ్ళీ రీమేక్ చేయడం ఏంటనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది. ఎన్ని మార్పులు చేసిన ఒరిజినాలిటీ ఎక్కడికి పోదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తరుణ్ భాస్కర్ నుంచి డైరెక్టర్ గా మంచి కథలని ప్రేక్షకులు ఆశిస్తూ ఉంటే ఆయన హీరోగా ఇలాంటి అరిగిపోయిన కథలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అనే మాట కూడా వినిపిస్తోంది.