Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : 8 వారాల్లో తేజ ఎంత సంపాదించాడో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా శనివారం హౌస్ నుంచి టేస్టీ తేజా ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో గత వారం మెగా చీఫ్ అయిన రోహిణి తప్ప మిగతా వారంతా కూడా నామినేషన్స్ లోకి వచ్చారు.

By:  Tupaki Desk   |   1 Dec 2024 6:55 AM GMT
బిగ్ బాస్ 8 : 8 వారాల్లో తేజ ఎంత సంపాదించాడో తెలుసా..?
X

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా శనివారం హౌస్ నుంచి టేస్టీ తేజా ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో గత వారం మెగా చీఫ్ అయిన రోహిణి తప్ప మిగతా వారంతా కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. ఐతే ఈ నామినేషన్స్ లో లీస్ట్ ఓటింగ్ రావడంతో తేజ ఎలిమినేట్ అయ్యాడు. ఐతే ఆదివారం మరొక హౌస్ మేట్ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సీజన్ 7 లో 10 వారాల దాకా ఉన్న తేజ ఈ వారం ఎనిమిది వారాలు మాత్రమే ఉన్నాడు.

సీజన్ 8 లో అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అక్టోబర్ 2న హౌస్ లోకి వెళ్లాడు. దాదాపు ఎనిమిది వారాల పాటు అతని ఎంటర్టైన్మెంట్ తో మెప్పించాడు. టాస్కుల్లో కూడా లాస్ట్ సీజన్ తో పోల్చితే ఈ సీజన్ లో తేజా తన బెస్ట్ ఇచ్చాడు. ఐతే లాస్ట్ సీజన్ తో పోల్చితే ఈ సీజన్ అతని రెమ్యునరేషన్ కూడా ఎక్కువే అన్నట్టు తెలుస్తుంది. వారానికి 4 లక్షల చొప్పున అగ్రిమెంట్ తో తేజ హౌస్ లోకి వెళ్లాడు.

అంటే ఈ సీజన్ లో 8 వారాలు హౌస్ లో ఉన్నాడు కాబట్టి 32 లక్షల దాకా పారితోషికం అందుకుంటున్నాడు. తేజ ఎలిమినేషన్ అందరు ఊహించినదే. ఎందుకంటే ఆట చివరి దశకు వస్తుండటం వల్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మధ్య పోటీ పెరుగుతుంది. ఈ క్రమంలో ఆడియన్స్ ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తారు. ఓటింగ్ పర్సెంటేజ్ లో తక్కువ ఉన్న వారంతా కూడా ఎలిమినేట్ అవ్వక తప్పదు.

బిగ్ బాస్ సీజన్ 8 మరో రెండు వారాలు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే అవినాష్ ఒక ఫైనలిస్ట్ అయ్యాడు మరో నలుగురు ఎవరన్నది తెలియాల్సి ఉంది. తేజ మళ్లీ హౌస్ లోకి వచ్చింది తన మదర్ ని ఫ్యామిలీ వీక్ కు తీసుకు రావాలనే.. ఐతే ఆ కోరిక నెరవేర్చాడు. సో ఫ్యామిలీ వీక్ అయ్యి రెండు వారాలు అవుతుంది అమ్మని హౌస్ లోకి తీసుకొచ్చిన రోజే తాను గెలిచానని తేజ అన్నాడు. మొత్తానికి సీజన్ 8 లో తేజ ఆట ముగిసింది. 8 వారాలకు గట్టిగానే రెమ్యునరేషన్ అందుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7 కన్నా సీజన్ 8 తోనే తేజా ఎక్కువ పారితోషికం అందుకున్నాడని తెలుస్తుంది.