Begin typing your search above and press return to search.

రెండేళ్ల‌లో గాయ‌ని ఆర్జ‌న 16,000 కోట్లు

పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ ఎరాస్ టూర్ ముగిసింది. ఈ టూర్ 16,000 కోట్ల (2.2 బిలియన్ డాల‌ర్ల‌)తో అత్యధిక వసూళ్లు చేసిన పర్యటనగా నిలిచింది.

By:  Tupaki Desk   |   11 Dec 2024 2:45 AM GMT
రెండేళ్ల‌లో గాయ‌ని ఆర్జ‌న 16,000 కోట్లు
X

పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ ఎరాస్ టూర్ ముగిసింది. ఈ టూర్ 16,000 కోట్ల (2.2 బిలియన్ డాల‌ర్ల‌)తో అత్యధిక వసూళ్లు చేసిన పర్యటనగా నిలిచింది. ఈ టూర్ దాదాపు రెండు సంవత్సరాల పాటు ఐదు ఖండాలను కవర్ చేసి 149 షోలలో కోటి (10 మిలియన్ల) మంది అభిమానులను అలరించింది. టేల‌ర్ స్విఫ్ట్ రికార్డ్ బ్రేకింగ్ అచీవ్‌మెంట్ ఇది. కోల్డ్‌ప్లే `మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్` ను అధిగ‌మించి దాదాపు రెట్టింపు వ‌సూల్ చేసింది.

టేలర్ స్విఫ్ట్ తన సంపాద‌న నుంచి కష్టపడి పనిచేసే సిబ్బందికి త‌గిన ప్రోత్సాహ‌కాల‌ను అంద‌జేసింది. పాప్ స్టార్ గత రెండు సంవత్సరాల్లో తన టూర్ సిబ్బందికి బోనస్‌ల రూపంలో 197 మిలియన్ డాల‌ర్ల‌ను చెల్లించింది. త‌న‌వ‌ద్ద ప‌ని చేసే నృత్యకారులు, సంగీతకారులు, భద్రతా బృందాలు, కొరియోగ్రాఫర్‌లు, ట్రక్ డ్రైవర్లు, క్యాటరర్లు, ఇన్స్ట్రుమెంట్ టెక్నీషియన్లు, మర్చండైజ్ టీమ్‌లు, లైటింగ్, సౌండ్ టెక్నీషియ‌న్లు, ప్రొడక్షన్ సిబ్బందికి బోనస్‌లు అంద‌జేసారు.

మార్చి 2023లో అరిజోనాలోని గ్లెన్‌డేల్‌లో ప్రారంభమైన ఎరాస్ టూర్ డిసెంబర్ 8న వాంకోవర్‌లో అద్భుతమైన చివరి ప్రదర్శనతో ముగిసింది. ``మొత్తం ప్రపంచాన్ని పర్యటించాం. ఇది నా మొత్తం జీవితంలో నేను చేసిన అత్యంత ఎగ్జ‌యిట్ చేసిన‌ శక్తివంతమైన అత్యంత‌ సవాళ్ల‌తో కూడిన పని అని టేల‌ర్ అభివ‌ర్ణించారు.

ఈ పర్యటనలో మేము 10 మిలియన్లకు పైగా ప్రదర్శనలు ఇచ్చాము అని స్విఫ్ట్ తెలిపారు. స్విఫ్ట్ ఎరాస్ టూర్‌ మార్చి 2023లో కెనడియన్ నగరంలో ప్రారంభమైంది. దాదాపు రెండు సంవత్సరాల కాలంలో 2.2 బిలియన్ డాల‌ర్ల‌ను ఆర్జించ‌గా..ఉత్తర అమెరికాలో పర్యటన నుంచి 1.04 బిలియన్ డాల‌ర్లను ఆర్జించారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సంఖ్య అంచనా 2.2 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకుంది.