తుఫాన్ రిలీఫ్ ఫండ్‌కు గాయని 42కోట్ల విరాళం
ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్న పాపులర్ గాయని దయా గుణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది
By: Tupaki Desk | 11 Oct 2024 3:15 AM GMTప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్న పాపులర్ గాయని దయా గుణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి పెను తుఫాన్ తో సర్వం కోల్పోయిన బాధితుల కోసం రిలీఫ్ ఫండ్ కి సదరు గాయని భారీ విరాళాన్ని ప్రకటించింది. దీని విలువ 5 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో 42 కోట్లు. ఈ ఎపిసోడ్ లో స్వచ్ఛంద సేవికురాలైన గాయని ఎవరు? అంటే... పాపులర్ అమెరికన్ గాయని-గేయరచయిత టేలర్ స్విఫ్ట్. తన మధురమైన స్వరంతో తరతరాలుగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్న టేలర్ స్విఫ్ట్ సంగీత కచేరీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా టేలర్ పాటకు ఉర్రూతలూగాల్సిందే.
దీనికి తోడు టేలర్ స్విఫ్ట్ ఎంత పెద్ద పాపులర్ గాయని అయినా కానీ, తనలోని దయార్ధ్ర హృదయం ప్రశంసలు అందుకుంటూనే ఉంది. మరోసారి ఆమె ఫ్లోరిడాలో హరికేన్ సహాయానికి తనవంతు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చింది, టేలర్ ఉదారమైన సహాయానికి ఆన్‌లైన్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. టేలర్ స్విఫ్ట్ ఫ్లోరిడాలో హరికేన్ సహాయక చర్యలకు 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 41 కోట్లు) విరాళంగా అందించింది. హెలీన్ హరికేన్ తర్వాత రాష్ట్రం కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది.
ముఖ్యంగా టేలర్ స్విఫ్ట్ ప్రపంచంలోని అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరు. కెరీర్ మ్యాటర్ కి వస్తే... టేలర్ తన రికార్డింగ్ ప్రాజెక్ట్‌లను కొనసాగించాలని భావిస్తున్నారు. ఆమె ఎరాస్ టూర్‌ను తిరిగి ప్రారంభించడానికి వచ్చే వారం దక్షిణ ఫ్లోరిడాకు తిరిగి వెళుతోంది. సెర్చ్‌లైట్ పేరుతో ఒక కథను రాసి దర్శకత్వం వహించడానికి టేలర్ సిద్ధంగా ఉంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో బ్లోండ్ ఫాంటమ్ పాత్రలోను ఈ భామ నటించనుంది.