Begin typing your search above and press return to search.

టేలర్ స్విఫ్ట్ లండన్ కాన్సర్ట్‌లో సితార జోష్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - న‌మ్ర‌త జంట గారాల కుమార్తె సితార ఘ‌ట్ట‌మ‌నేని ఏ వేదిక‌పై ఉన్నా అక్క‌డ త‌ను ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారుతోంది

By:  Tupaki Desk   |   1 July 2024 5:54 AM GMT
టేలర్ స్విఫ్ట్ లండన్ కాన్సర్ట్‌లో సితార జోష్
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - న‌మ్ర‌త జంట గారాల కుమార్తె సితార ఘ‌ట్ట‌మ‌నేని ఏ వేదిక‌పై ఉన్నా అక్క‌డ త‌ను ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారుతోంది. ఇటీవల లండన్‌లో జరిగిన టేలర్ స్విఫ్ట్ ఎరాస్ టూర్ కచేరీలో న‌మ్ర‌త‌-సితార‌ ద్వయం త‌మ విలువైన‌ సమయాన్ని గడిపారు. ఈ వేదిక నుండి కొన్ని అద్భుత‌మైన ఫోటోల‌ను న‌మ్ర‌త ఇన్ స్టాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. సితార స్టాండ్స్ లో బిగ్గరగా ఉత్సాహంగా పాడటాన్ని న‌మ్ర‌త కెమెరాల్లో బంధించింది. నమ్రత తన కుమార్తె టేలర్ స్విఫ్ట్ కి పెద్ద‌ అభిమాని అని.. పాప్ సింగర్ మ్యూజిక్ ఆల్బమ్‌ల‌ను కూడా వీక్షిస్తుంద‌ని వెల్లడించింది.

నా కుమార్తె టేలర్‌ను ప్రేమిస్తుంది! నేను నా కుమార్తెను ప్రేమిస్తున్నాను.. కాబట్టి నేను టేలర్‌ని ప్రేమిస్తున్నాను. సితార త‌న‌ సన్నిహితురాలు స్వాతితో కలిసి ఒక అంద‌మైన‌ సాయంత్రం కోసం అడగలేకపోయాను! అని న‌మ్ర‌త‌ పేర్కొంది. చివరగా టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన అద్భుతంగా ఉంది అని న‌మ్ర‌త‌ పేర్కొంది.

నమ్రత అభిమానులు చాలా మంది తల్లీ కూతుళ్లను మెచ్చుకున్నారు. వారిలో ఒకరు ''అమ్మ తన కుమార్తె ఆనందాన్ని రికార్డ్ చేస్తోంది'' అని వ్యాఖ్యానించారు. నమ్రత శిరోద్క‌ర్ -మహేష్ బాబుల‌ కుమారుడు గౌతమ్ ఇటీవల తన మొదటి థియేట్రిక‌ల్ ప్రదర్శనను లండన్‌లో ప్రదర్శించారు. ఆ స‌మ‌యంలో సితార‌- న‌మ్ర‌త ఫోటోలు కూడా అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.