ముంబైలో 'మట్కా'... వరుణ్ పాన్ ఇండియా ఆశలు
సినిమా హిందీ వర్షన్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
By: Tupaki Desk | 4 Nov 2024 11:42 AM GMTమెగా హీరో వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాతో ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'మట్కా' సినిమాలో వరుణ్ తేజ్ మూడు విభిన్నమైన ఏజ్ గ్రూప్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ హిందీలోనూ విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.
సినిమా హిందీ వర్షన్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మట్కా సినిమా హిందీ ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉంటుందని, కచ్చితంగా అక్కడ మంచి స్పందన వస్తుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ మీనాక్షి చౌదరిలు సినిమా గురించి చెప్పుకొచ్చారు. కథ, కథనం నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని దర్శకుడు కరుణ కుమార్ తెలియజేశారు.
ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలు నార్త్ లో మంచి వసూళ్లు నమోదు చేస్తున్నాయి. దేవర సినిమాకు అక్కడ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసిన విషయం తెల్సిందే. దాంతో సినిమాకు అక్కడ నుంచి డీసెంట్ వసూళ్లు దక్కాయి. కనుక మట్కా సినిమాకు సైతం మంచి వసూళ్లు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నెట్టింట మట్కా గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మంచి వసూళ్లతో పాటు, సినిమాకు రివ్యూవర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి మట్కా సినిమా హిందీ వర్షన్ పై మేకర్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. కనుక ఈ సినిమాపై ఆయన చాలా నమ్మకం పెట్టుకుని, కష్టపడి చేశాడని తెలుస్తోంది. వరుణ్ తేజ్ మొదటి పాన్ ఇండియా మూవీ మట్కా కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. వరుణ్ కంటున్న పాన్ ఇండియా కల ఈ సినిమాతో నెరవేరుతుందా అనేది చూడాలి. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నుంచి రాబోతున్న మట్కా సినిమా ఆయనకు చాలా స్పెషల్ మూవీ అంటూ యూనిట్ సభ్యులు మాట్లాడుతున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా హిందీ వర్షన్ ఎలా ఉంటుంది... ఓవరాల్ గా ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుంది అనేది వచ్చే వారంలో సినిమా విడుదల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.