Begin typing your search above and press return to search.

ఆట పాట ఓకే.. ప్రమోషన్స్ సంగతేంటి కల్కి?

ఇటలీ లో ఆట పాట అంటూ వదిలిన ఆ ఫొటోలో నటీనటులతో పాటు టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక జెట్ దగ్గర స్టిల్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   6 March 2024 12:35 PM GMT
ఆట పాట ఓకే.. ప్రమోషన్స్ సంగతేంటి కల్కి?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ బడ్జెట్ మూవీ కల్కి 2898 AD సినిమా విడుదల కోసం ఓవర్గం ఫాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను నెవర్ బిఫోర్ అనేలా తెరపైకి తీసుకురాబోతున్నాడు.

సినిమాను మే 9వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా విడుదల రెండు నెలల సమయం కూడా లేదు. ఇంత పెద్ద సినిమాకు ఈపాటికే ఒక రేంజ్ లో సౌండ్ ఉండాలి. రెగ్యులర్ గా పోస్టర్స్ కూడా విడుదల చేస్తూ ఉండాలి. అలాగే రెగ్యులర్ గా కాకుండా భిన్నంగా ఇంకా ఏదో కొత్తగా చేస్తూ ఉండాలి అప్పుడే సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. మిగతా భాషల్లో సినిమాను ప్రమోట్ చేయాలి.

కానీ ప్రమోషన్స్ విషయంలో అయితే చిత్ర యూనిట్ అంత దూకుడుగా ఏమీ కనిపించడం లేదు. గతంలో పలు ఫిలిం ఫెస్టివల్స్ లో ఫస్ట్ లుక్ పోస్టర్లతో అలాగే సినిమాలోని కొన్ని కాన్సెప్ట్ లతో హడావుడి చేసినప్పటికీ అదేమీ అంతగా క్లిక్ కాలేదు. అంతేకాకుండా ఫస్ట్ గ్లింప్స్ వీడియో పై కూడా కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక మేకర్స్ మాత్రం ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని నెక్స్ట్ అప్డేట్స్ విషయంలో అయితే మరింత కేర్ఫుల్ గా ఉంటామని కూడా క్లారిటీ ఇచ్చారు.

రీసెంట్ గా ఇటలీలో సినిమాకు సంబంధించిన ఒక పాటను షూట్ చేయబోతున్నట్లు ఫోటోను వదిలారు. ఇటలీ లో ఆట పాట అంటూ వదిలిన ఆ ఫొటోలో నటీనటులతో పాటు టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక జెట్ దగ్గర స్టిల్ ఇచ్చారు. దాదాపు సినిమా షూటింగ్ అయితే పూర్తయింది. కేవలం సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ దిశా పటాని మధ్యలో వచ్చే ఈ రొమాంటిక్ సాంగ్ ప్రత్యేకంగా ఉండబోతుందట.

అయితే ఈ తరహా హడావిడి బాగానే చేస్తున్నారు, కానీ సినిమాకు రేంజ్ పెంచే విధంగా అసలైన ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు అనే విషయంలో మాత్రం సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఆటపాట ఓకే కానీ ప్రమోషన్ సంగతి ఏంటి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ రేంజ్ లో విడుదల చేస్తారు అని చెప్పడం బాగానే ఉంది. కానీ ఆ రేంజ్ కు తగ్గ కంటెంట్ తో కూడా సినిమాను ప్రమోట్ చేయాలి.

ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు సలార్ విషయంలో కూడా సంతృప్తి చెందలేదు. దీంతో కల్కి పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని నమ్మకంతో ఉన్నారు. కానీ మేకర్స్ అప్డేట్స్ మాత్రం ఆ రేంజ్ లో అయితే కనిపించడం లేదు. మరి అలాంటి వారికి సమాధానం ఇచ్చేలా.. సినిమా రేంజ్ పెరిగేలా వైజయంతి టీమ్ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో చూడాలి.