Begin typing your search above and press return to search.

ప‌దేళ్ల వ‌య‌సులోనే రోడ్డున ప‌డ్డాను!

ప‌దేళ్ల త‌ర్వాత చాలా ర‌కాల ప‌నులు చేసాను. ఇంట్లో అంట్లు తోమాను. కుక్క ఉంటే దానికి స్నానాలు, ఇంట్లో పుష్ కొడితే క్లీన్ చేయ‌డం అన్నీ చేసాను.

By:  Tupaki Desk   |   20 March 2025 9:28 AM IST
ప‌దేళ్ల వ‌య‌సులోనే రోడ్డున ప‌డ్డాను!
X

తెలుగు చిత్ర‌సీమ‌లో త‌న‌కంటూ ఒక మార్క్ ఉంద‌ని నిరూపించిన ద‌ర్శ‌కుడు తేజ. చిత్రం, నువ్వు నేను, జ‌యం, నేనే రాజు నేనే మంత్రి లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడిగా స్థిర‌ప‌డిన త‌ర్వాత అత‌డు ద‌ర్శ‌కుడిగా మారారు. ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీల‌ వార‌సుల‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేసారు ఆయ‌న‌. ఉద‌య్ కిర‌ణ్, నితిన్ లాంటి యంగ్ హీరోల‌ను అత‌డే తెర‌కు ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే.

తెలుగు చిత్ర‌సీమ‌లో సుదీర్ఘ కాలం ప‌ని చేసిన ఆయ‌న కోటీశ్వ‌రుడు.. ఆస్తులు బాగానే కూడ‌బెట్టారు.. స్థితిమంతుడు.. ఇది మాత్ర‌మే లోకానికి తెలుసు. అంత‌కుముందు తేజ కుటుంబం ఓ వెలుగు వెలిగి, రోడ్డున ప‌డ్డ విష‌యం కొంద‌రికే తెలుసు. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తేజ త‌న క‌ష్టాల క‌న్నీళ్ల గాధ గురించి చెప్పుకొచ్చారు. ఆయ‌న చిన్న‌ప్ప‌టి జీవితం గురించి తెలుసుకుంటే క‌న్నీళ్లు పెట్టుకుంటారు. అంత‌టి ఎమోష‌న్ దాగి ఉంది లైఫ్ లో. త‌న తండ్రి ఆస్తిమంతుడు, తల్లి విద్యావంతురాలు. కార్ల‌లో ల‌గ్జ‌రీ లైఫ్. కానీ విధి వ‌క్రించింది. అమ్మా నాన్న తేజ చిన్న‌ప్పుడే కాలం చేసారు. అంత‌కుముందే ఉన్న ఆస్తుల‌న్నీ కోల్పోయారు. ఆ త‌ర్వాత పూరి గుడిసెలో బ‌త‌కాల్సి వచ్చింది. కొన్నాళ్ల‌కే రోడ్డున ప‌డ్డ ప‌రిస్థితి.

ఇదే విష‌యంపై తేజ స్వ‌యంగా ఏబీఎన్ రాధాకృష్ణ‌కు చెప్పిన సంగ‌తులు ఇలా ఉన్నాయి.

*అమ్మ నాకు ఊహ తెలియ‌ని రోజుల్లోనే చ‌నిపోయారు. నాకు ఒక చెల్లి, అక్క ఉన్నారు. అమ్మ ఉన్న‌త‌ విద్యావంతురాలు. నాన్న‌ ఎగుమ‌తుల వ్యాపారం చేసారు. అమ్మ చిన్న‌ప్పుడే చ‌నిపోయాక‌, ఏమైందో తెలీదు ఊహ తెలిసేప్ప‌టికి నాన్న కూడా పోయారు. అమ్మ ఎలా ఉంటారో తెలీదు. ఫోటో చూపించాలి. నాన్న ఎలా ఉంటారో తెలుసు.. అప్ప‌ట్లోనే మా అమ్మ భారీగా ఆస్తులు కొన్నార‌ట‌. అవి ఎలా పోయాయో కూడా తెలీదు. ఎక్క‌డున్నాయో తెలీదు. నాన్న‌గారు ఉన్నప్ప‌టికీ ఆస్తులు ఎలా పోయాయో తెలీదు. సంప‌న్న కుటుంబంలో పుట్టి పెరిగాను. నాకు స‌ప‌రేట్ కార్. నా అక్కా చెల్లెళ్ల‌కు ఒక్కక్క‌రికి ఒక్కో కార్ ఉండేది. మా ఫ్యామిలీ ఆస్తులు ఎన్ని అంటే.. ఫోటోల్లోనే పెద్ద పెద్దబిల్డింగులు క‌నిపించేవి. నాకు ఊహ వ‌చ్చేప్ప‌టికి లేవు. నా 9-10 వ‌యసులో పూరి గుడిసె నుంచి రోడ్డున ప‌డ్డాం.

* అమ్మా నాన్న పోయాక మ‌మ్మ‌ల్ని ఒక్కొక్క‌రుగా బంధువులు పంచుకున్నారు. నేను ఒక చిన్నాన్న ఇంట్లో.. చెల్లి ఇంకో చిన్నాన్న ఇంట్లో ఉంటే, అక్క వేరొక‌రి ఇంట్లో ఉంది. వారంతా పంచుకున్నారు. కానీ వారికి మ‌మ్మ‌ల్ని పోషించే వెసులు బాటు లేదు. మిడిల్ క్లాస్ అప్ప‌ర్ మిడిల్ క్లాస్ లో ఉన్నారు వాళ్లు. చిన్న‌ప్పుడు నాన్న నుంచి ఏదైనా డ‌బ్బు వ‌స్తే అది వారికి ఇచ్చేవాళ్లం. పాండి బజార్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అడిగేవాడిని.. డ‌బ్బు క‌వ‌ర్ వ‌చ్చిందా? అక్కా చెల్లి నేను ఆ డ‌బ్బు కోసం అని పోస్ట్ కోసం టెన్ష‌న్ ప‌డేవాళ్లం.

* ప‌దేళ్ల త‌ర్వాత చాలా ర‌కాల ప‌నులు చేసాను. ఇంట్లో అంట్లు తోమాను. కుక్క ఉంటే దానికి స్నానాలు, ఇంట్లో పుష్ కొడితే క్లీన్ చేయ‌డం అన్నీ చేసాను. చ‌దువు స‌రిగా సాగ‌లేదు.. ఏడో క్లాస్ వ‌ర‌కూ ఏ క్లాస్ చ‌దివేవాడినో తెలీదు. బంధువుల‌ ఇంట్లో ఉండి వాళ్ల‌ను హ్యాపీ చేయ‌డానికి ప‌ని చేసాను. త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చేసి సినీప‌రిశ్ర‌మ‌లో కెమెరా డిపార్ట్ మెంట్లో చేరాను. ఏడాది అనుభ‌వం కోసం ప‌ని చేయ‌మ‌న్నారు. కొంద‌రు ముందే చెప్పేవారు.. డ‌బ్బులు ఇచ్చేవారు కాదు. అయితే పెద్ద అపార్ట్ మెంట్ ద‌గ్గ‌ర‌ కార్లు తుడిచి భ‌త్యం తెచ్చుకునేవాడిని. నెల‌కు 100 ఇచ్చేవారు.. మూడు కార్లు తుడిచేవాడిని.. నెల‌కు 300 వ‌చ్చేది. మున్సిప‌ల్ ట్యాప్ ద‌గ్గ‌ర నిల‌బడి.. స్నానం చేసేవాడిని.. రెండు ఫ్యాంట్లు రెండు ష‌ర్టులే ఉండేవి. ఒక‌టి ఉతుక్కుని... ఒక‌టి తొడిగేవాడిని.

* షూటింగులు ఉంటే, మూడు పూట్ల తినేవాడిని.. ఎక్కువ‌ తింటుంటే ప‌ట్టేకుసునేవాళ్లు.. త‌ర్వాత కెమెరామేన్ కి ఈ విష‌యాలు తెలిసి ఆయ‌న ఎక్కువ డ‌బ్బులు ఇచ్చారు. ఒక కెమెరామేన్‌ ఏడాది త‌ర్వాత ఇస్తాను అని ఒప్పందం కుదుర్చుకున్నా, 2 నెల‌ల‌కే రోజుకు రూ.25 చొప్పున ఇచ్చారు. నా ఆర్థిక ప‌రిస్థితి మెరుగైంది.

ఇలాంటి ఎన్నో ఆరంభ జీవిత క‌ష్టాల‌ను ద‌ర్శ‌కుడు తేజ ఆ ఇంట‌ర్వ్యూలో షేర్ చేసారు.