Begin typing your search above and press return to search.

ఫిలిం ఫెస్టివల్ లో తేజా కు షాకింగ్ ఎక్సపీరియన్స్..

తాజాగా హనుమాన్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన తేజ సజ్జా కూడా ఇదే రకమైన ఓ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అయితే మిగిలిన వాళ్ళ కంటే ఇతను ఎదుర్కొన్న పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది.

By:  Tupaki Desk   |   24 Nov 2024 8:46 AM GMT
ఫిలిం ఫెస్టివల్ లో తేజా కు షాకింగ్ ఎక్సపీరియన్స్..
X

సినిమాలను , సినిమా స్టోరీని ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకుంటున్నారు. చాలా సందర్భాలలో స్టోరీకి బాగా కనెక్ట్ అయినా కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈమధ్య లవ్ రెడ్డి అనే ఒక మూవీ రిలీజ్ అయినప్పుడు.. అందులో విలన్ పాత్ర చేసిన నటుడు మీదకు సినిమా చూసిన ఓ లేడీ దాడికి పాల్పడింది. సినిమా స్టోరీలో వేరే కులం అబ్బాయిని ప్రేమించింది అనే కారణంతో విలన్ తన కూతుర్ని చంపేస్తాడు. ఈ కంటెంట్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో ఆమె విలన్ పై తన కోపాన్ని ప్రదర్శించింది.

‘వేట్టయాడు విలయాడు’అని మూవీలో విలన్ గా చేసిన వ్యక్తి ఒకసారి లిఫ్ట్ లో ఎంటర్ అయినప్పుడు అతని చూసిన అమ్మాయిలు హడలిపోయి అక్కడ నుంచి పరిగెత్తారు. తాజాగా హనుమాన్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన తేజ సజ్జా కూడా ఇదే రకమైన ఓ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అయితే మిగిలిన వాళ్ళ కంటే ఇతను ఎదుర్కొన్న పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది.

గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ ఫిలిం ఫెస్టివల్ కు అతిథిగా వెళ్ళిన తేజ స్టేజి మీదకు వచ్చి ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న సందర్భంలో ఎవరు ఊహించని ఓ సంఘటన చోటుచేసుకుంది. తెల్లని గడ్డంతో ఉన్న ఓ పెద్దమనిషి స్టేజి ఎక్కి తేజా కాళ్లకు దండం పెట్టుకున్నాడు.

సడన్గా తనకు ఎదురైన ఈ పరిణామాన్ని ఎక్స్పెక్ట్ చేయని తేజ ఆ పెద్దాయనను వారించడానికి ఎంతో ప్రయత్నించాడు. హనుమాన్ మూవీలో.. ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందిన పాత్రలో తేజాను చూసి ఓ డివైన్ ఫీలింగ్ పొందినందు వల్ల ఆ వ్యక్తి అలా ప్రవర్తించారు. వీటిని పట్టి ప్రేక్షకులపై సినిమాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది.

సినిమాలు మనిషిని మంచివైపు ఎంత ప్రభావితం చేస్తాయో కొన్ని సందర్భాలలో చెడువైపు కూడా అంతే ఆకర్షిస్తాయి.అందుకే సినిమాలు తీసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని బాధ్యతాయుతమైన కంటెంట్లతో సినిమాలు తీయడం మంచిది. ఈ నేపథ్యంలో ఏదో సినిమా తీశాము అంటే తీసాము అన్నట్లు కాకుండా చూసేవారికి దానివల్ల ప్రయోజనం కలిగే విధంగా ఉంటే బాగుంటుంది అని కొందరు భావిస్తున్నారు.