Begin typing your search above and press return to search.

ఐఫాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా హనుమాన్ హీరో తేజ సజ్జా

ప్రతిష్ఠాత్మక ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరిగింది.

By:  Tupaki Desk   |   28 Sep 2024 5:00 AM GMT
ఐఫాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా హనుమాన్ హీరో తేజ సజ్జా
X

ప్రతిష్ఠాత్మక ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరిగింది. సూపర్ హీరో తేజ సజ్జా హోస్టింగ్ ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

తన చరిస్మాటిక్ ప్రజెన్స్ తో అతిథులని ఆప్యాయంగా పలకరిస్తూ, అద్భుతమైన మాటతీరుతో అందరినీ ఎంగేజ్ చేస్తూ వేడుకని చాలా లైవ్లీగా ముందుకు నడిపారు తేజ సజ్జా.

గ్రేట్ సెన్స్ అఫ్ హ్యుమర్ తో నవ్వులు పంచుతూ, అవార్డ్స్ వేడుకని ఆద్యంతం చాలా ఎనర్జిటిక్ గా హోస్ట్ చేయడంలో అందరి ప్రసంశలు అందుకున్నాడు.

తన డ్రెస్సింగ్ , వాకింగ్ స్టయిల్, ఎఫెక్టివ్ కమ్యునికేషన్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. హోస్ట్ గా తన ఎనర్జీ అండ్ టైమింగ్ కి అందరూ స్టన్ అయ్యారు.

హనుమాన్ తో గ్లోబల్ బ్లాక్ బస్టర్ అందుకున్న తేజసజ్జాని దుబాయ్ క్రౌడ్ గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. తేజాతో ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు.

సినిమాల్లోకి వస్తే.. ప్రస్తుతం తన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ 'మిరాయ్‌'తో బిజీగా వున్నారు తేజ సజ్జా. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపించనున్నారు. 2025 సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది.